Sanghi Nagar
-
డీసీఎం ఢీకొని ఒకరి మృత్యువాత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సంఘీనగర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంఘీనగర్లో నివసించే భాస్కర్రావు(65) సంఘీ పాలిమర్స్ సమీపంలో రోడ్డుపక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. తల పగిలి ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం డీసీఎం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సంఘటన స్థలిని పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా షూటింగ్లో అపశృతి: వ్యక్తి మృతి
హయత్నగర్ (హైదరాబాద్) : సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పరిధిలోని సంఘీ నగర్లో శనివారం నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తిరుపతి అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.