వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం పాములూరుగుట్ట వద్ద శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు జింక చనిపోయింది.
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం పాములూరుగుట్ట వద్ద శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు జింక చనిపోయింది. ముత్తుకూరు గ్రామానికి చెందిన లింగాల గోపాల్‌రెడ్డి(45) వేంపల్లె మీదుగా పాములూరు గ్రామానికి స్కూటర్‌పై బయలుదేరాడు. అతని వాహనం గుట్ట వద్ద అడ్డుగా వచ్చిన జింకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గోపాల్‌రెడ్డితో పాటు జింక కూడా చనిపోయింది. సమాచారం అందుకున్న అటవీ, పోలీసుశాఖల అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.