కొత్తగూడ(ములుగు): అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబా బాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కన్నెబోయిన దుర్గయ్య(32) ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బీడీల కోసమని బయటకు వెళ్లాడు. బీడీలు తీసుకుని అత్తగారింటి వద్ద ఉంటున్న కుమారులను చూసేందుకని వెళుతున్నట్లు ఇరుగు,పొరుగు వారితో చెప్పుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దుర్గ య్య ఆచూకీ కోసం బంధువులు అన్ని చోట్లా వెతికారు. రోజులు గడుస్తున్నా ఏ సమాచారం తెలియకపోవడంతో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీ సులు విచారిస్తుండగానే సోమవారం జంగవానిగూడెం, ఎర్రవరం గ్రామాల మధ్య ఉన్న పాడుబడ్డ బావిలో కుళ్లిపోయిన శవం ఉండడాన్ని గమనించి స్థానికులు తెలిపింది. దుస్తుల ఆధారంగామృతుడు దుర్గయ్యగా గుర్తించారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..?
కన్నెబోయిన దుర్గయ్య(32)కు అదే గ్రామానికి చెందినమహిళతో14ఏళ్ల క్రితం వివాహం జరిగిం ది. ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళుగా దుర్గ య్య అతడి భార్య కు మధ్య గొడవలు జరుగుతున్నా యి. భార్య వివాహేత సంబంధం కలిగి ఉందని దుర్గయ్య ఫిర్యాదు చేయడంతో పలు సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా దుర్గయ్య నుంచి విడిపోయి పిల్లలతో కలిసి తల్లిగారింట్లో ఉం టోంది. పిల్లలను చూసేందుకు రాత్రి వెళ్లిన దుర్గయ్యతో ఆమె గొడవపడి ఉంటుందని, మరి కొందరితో కలిసి దుర్గయ్యను హత్య చేసి బావిలో పడేసి ఉంటుందనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. లేక గొడవలతో విసిగిపోయిన దుర్గయ్యే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment