త్రిపురారం: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బడాయిగడ్డ గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధనావత్ శ్రీను(30) తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టడానికి స్విచ్‌బోర్డులో చార్జర్‌ను పెడుతుండగా అతని చేతి వేలు చార్జర్ పిన్నులకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాధితుడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.