సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యూడు.
కురవి: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యూడు. వరంగల్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు ఎల్‌జీ తండాకు చెందిన లూనావత్ కైక, వస్రాంల కుమారుడు లూనావత్ లక్ష్మణ్(18) ఇంటర్ పూర్తి చేశాడు. వరంగల్‌లో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బుధవారం ఉదయం తండాలోని తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.