
హుజూరాబాద్‌రూరల్: అతివేగం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మండలంలోని శాలపల్లి ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మికుంట– హుజూరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. నలుగురు గాయపడ్డారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వీణవంకకు చెందిన పులాల మల్లయ్య(53), పులాల లచ్చవ్వ, సిర్సపల్లికి చెందిన తూనికి అంజయ్య ఆటోలో జమ్మికుంట నుంచి హన్మకొండ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మల్లయ్య, లచ్చవ్వ, అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ అంకూస్, మరో వ్యక్తి రాజేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించగా.. మల్లయ్యను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment