
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ : ఒకరి మృతి
మల్లాపూర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మల్లాపూర్ మండలం రాఘవాపేట్ శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న ఖానాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మెట్‌పల్లి నుంచి ఖానాపూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.