హైదరాబాద్: ఇద్దరి వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
స్థానిక భగత్‌సింగ్ నగర్‌లో నివాసముంటున్న ఆటోడ్రైవర్ నర్సింహులు, శ్రీను ఇద్దరు శుక్రవారం రాత్రి కల్లు తాగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో వీరి మధ్య వివాదం చెలరేగింది. వాదన పెరిగి పరస్పరం ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శ్రీను చేతికి అందిన బండరాయితో నర్సింహులు తలపై బలంగా మోదాడు. దీంతో నర్సింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇరువురి మధ్య ఘర్షణ..ఒకరి మృతి
Published Sat, Jun 25 2016 10:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement