అత్తాపూర్లో రోడ్డుప్రమాదం..ఒకరి మృతి | one died in hyderabad attapur accident | Sakshi
Sakshi News home page

అత్తాపూర్లో రోడ్డుప్రమాదం..ఒకరి మృతి

Published Sat, Sep 24 2016 7:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

one died in hyderabad attapur accident

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

అత్తాపూర్‌లోని పిల్లర్‌ నంబర్-176 సమీపంలో ఉండే ప్రణయ్‌కాంత్‌రెడ్డి, అతని మిత్రుడు దర్శిసింగ్ బైక్‌పై ఎయిర్‌పోర్టుకు వెళుతున్నారు. విమానాశ్రయం ప్రధాన రహదారిలో వారి వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్శిసింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రణయ్‌కాంత్‌రెడ్డిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement