కత్తులతో దాడి..
హైదరాబాద్ సిటీ: భవానినగర్ పీఎస్ పరిధిలోని హైదయత్ ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ మేనమామ తన అల్లుడిపై దాడి చేశాడు. తన భార్యకు సంబంధించిన నగల విషయంతో గొడవ రావడంతో కత్తులతో సొంత మేనల్లుడిని దారుణంగా పొడిచాడు.ఈ ఘటనలో అహ్మద్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం దగ్గరలోని అస్రా హాస్పిటల్‌కు తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.