ప్రకాశం జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
కందుకూరు: ప్రకాశం జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కందుకూరు ఓబీ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు.
కందుకూరు డిపోకు చెందిన బస్సు ఒంగోలు వైపు వెళ్లుతున్న క్రమంలో.. ఎదురుగా సింగరాయకొండ వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న కొండేపి మండలం విల్లూరు గ్రామానికి చెందిన పిల్లి నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేరని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.