కొచ్చి: భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్‌లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది..
కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌లో ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్‌తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment