తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ బైక్ అదుపుతప్పి గోదావరి నదిలోకి దూసుకెళ్లింది.
కె.గంగవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ బైక్ అదుపుతప్పి గోదావరి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు నదిలో గల్లంతు కాగా, మరోక వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
యానాం నుంచి కడియం వైపు బైక్‌పై వెళ్తుండగా కోట గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో బైక్ నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.