- గిరిజనుల ఇటుకల పండుగ
- బ్రేకులు ఫెయిలై జనంపైకి దుసుకెళ్లిన ప్రైవేటు బస్సు
-యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు
-ఆగ్రహించిన గిరిజనం... దాడిలో డ్రైవర్, కండక్టర్లపై దాడి
-డ్రైవర్ పరిస్థితి విషమం
సీలేరు (విశాఖ జిల్లా) : గిరిజనులు సంబరంగా జరుపుకునే ఇటుకల పండుగలో విషాదం చోటుచేసుకుంది. గుమ్మిరేవుల పంచాయతీ బోడిరాయి గ్రామం వద్ద గిరిజనులు ఆదివారం సాయంత్రం ఇటుకల పండుగ నిర్వహించారు. వారంతా రోడ్డుపక్కన ఆనందోత్సాహాలతో గడుపుతున్న వేళ అటుగా వచ్చిన ఒక ప్రైవేటు బస్సు బ్రేకులు ఫెయిలై జనంపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో గిరిజన యువతి కాసులమ్మ(22) అక్కడికక్కడే మృతిచెందగా, సీతాపుట్టు మరో మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహించిన జనం బస్సు కండక్టర్, డ్రైవర్‌లకు దేహశుద్ది చేశారు. ఈ దాడిలో డ్రైవర్ కొర్ర సెలూన్, కండక్టర్ రవి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
ఇటుకల పండుగలో విషాదం: యువతి మృతి
Published Sun, Apr 24 2016 7:13 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement