వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు.
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఐలయ్య(45) గ్రామ శివారులో గొర్రెలు కాస్తుండగా.. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో తడవకుండా ఉండటానికి చెట్టు నీడకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.