
నందిపాడు(దుత్తలూరు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనచోదకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని నందిపాడు వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు..వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి కి చెందిన వీరాంజనేయులు(24) నెల్లూరులో నివాసం ఉంటున్నాడు. మోటారుసైకిల్‌పై సొంతూరికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో నందిపాడు వద్ద బద్వేల్ నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో వీరాంజనేయులు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది క్షతగాత్రుడ్ని ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దుత్తలూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment