లారీని ఢీ కొట్టిన బస్సు, ఒకరు మృతి
Published Sat, Dec 17 2016 8:10 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం లట్టిగామ్ సమీపంలో శనివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా దాదాపు 15 మంది గాయాలపాలయ్యారు. నందిగామ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఒక ప్రయాణికుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement