కల్తీకల్లు దొరక్క ఒకవైపు పదుల సంఖ్యలో బాధితులు రంగారెడ్డి జిల్లా తాండూరులోని ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తుంటే.. మరోవైపు ఇదే జిల్లా బషీరాబాద్ మండలంలో ఓ వ్యక్తి కల్తీకల్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు.
రంగారెడ్డి జిల్లా : కల్తీకల్లు దొరక్క ఒకవైపు పదుల సంఖ్యలో బాధితులు రంగారెడ్డి జిల్లా తాండూరులోని ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తుంటే.. మరోవైపు ఇదే జిల్లా బషీరాబాద్ మండలంలో ఓ వ్యక్తి కల్తీకల్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని ఎక్మయి గ్రామంలో నర్సప్ప (35) మంగళవారం రాత్రి కల్తీ కల్లు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రి కావడంతో ఎవరూ గుర్తించలేదు. బుధవారం ఉదయం నర్సప్ప మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు