భార్య కళ్ల ముందే భర్త దారుణ హత్య | Delhi Police Says Man Stabbed To Death In Front Of Wife | Sakshi
Sakshi News home page

భార్య కళ్ల ముందే భర్త దారుణ హత్య

Published Fri, Feb 8 2019 12:35 PM | Last Updated on Fri, Feb 8 2019 12:36 PM

Delhi Police Says Man Stabbed To Death In Front Of Wife - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : సొంత ఇంటిలో, భార్య కళ్ల ముందే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంగ్‌లోయిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీపక్‌ అనే వ్యక్తి హరిద్వార్‌ నుంచి రెండు రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో పూర్తిగా మద్యం మత్తులో మునిగిన తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఓ వ్యక్తి కత్తితో దీపక్‌పై దాడి చేసి అతడిని పొడిచాడు. ఆ సమయంలో వారిని డిన్నర్‌కు పిలిచేందుకు దీపక్‌ భార్య అక్కడికి రావడంతో.. నిందితుడు పారిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి దీపక్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ నేపథ్యంలో దీపక్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement