నా చెల్లెలినే ప్రేమిస్తావా?! | TN Student Stabbed To Death Over Love Affair | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం; కత్తితో పొడిచి..

Published Fri, Jun 28 2019 12:28 PM | Last Updated on Fri, Jun 28 2019 12:30 PM

TN Student Stabbed To Death Over Love Affair - Sakshi

శ్రవణ్‌కుమార్‌- హరిహర షణ్ముగం(ఫైల్‌)

చెన్నై ‌: తన చెల్లిని ప్రేమించాడని తోటి విద్యార్థిని హత్యచేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తురైపాక్కం సమీపంలో బుధవారం జరిగింది. వివరాలు.. చెన్నై సమీపం తురైపాక్కం ప్రాంతంలో ప్రైవేట్‌ వంట శిక్షణ కళాశాల ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఆనందపూర్‌కు చెందిన శ్రవణ్‌ కుమార్‌ (20) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతనితో పాటు అదేగ్రామానికి చెందిన హరిహర షణ్ముగం (20) అక్కడే చదువుతున్నాడు. ఇద్దరూ కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. కాగా హరిహర షణ్ముగం చెల్లెలి వరుసైన అమ్మాయిని శ్రవణ్‌ కుమార్‌ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హరిహర షణ్ముగం, తన చెల్లిని ప్రేమించకూడదని శ్రవణ్‌కుమార్‌ని పలుసార్లు హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరికి తరచు గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో బుధవారం కళాశాలకి వచ్చిన శ్రవణ్‌కుమార్‌ని హరిహర షణ్ముగం ప్రవేశద్వారం వద్ద నిలిపి తన చెల్లితో ప్రేమని మరిచిపోవాలని హెచ్చరించాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహంతో హరిహర షణ్ముగం తన వద్ద ఉన్న కత్తితో శ్రవణ్‌ కుమార్‌ని పొడిచాడు. తీవ్రగాయాలైన శ్రవణ్‌కుమార్‌ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి హరిహర షణ్ముగంని అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement