సాక్షి, నల్గొండ: ఓ ప్రేమోన్మాది మద్యం మత్తులో చెలరేగిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని అతి దారుణంగా హతమర్చాడు. ఈఘటన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ శివం హోటల్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ప్రియురాలు చందనను శంకర్ బీరు సీసాతో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. చందన పెళ్లికి నిరాకరించడంతోనే శంకర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment