ఘోరం: బీటెక్‌ విద్యార్థి గుండెల్లో కత్తి దింపి.. | BTech Student Stabbed To Death In UP Murder Caught On Camera | Sakshi
Sakshi News home page

ఘోరం: బీటెక్‌ విద్యార్థి దారుణ హత్య

Published Fri, Feb 21 2020 8:27 AM | Last Updated on Fri, Feb 21 2020 8:37 AM

BTech Student Stabbed To Death In UP Murder Caught On Camera - Sakshi

లక్నో: స్నేహితుడిని కలవడానికి వెళ్లిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మాటు వేసిన దుండగులు ఛాతిలో కత్తి దింపి అతడి ప్రాణాలు బలిగొన్నారు. ఈ పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వివరాలు... వారణాసికి చెందిన ప్రశాంత్‌ సింగ్‌(23) అనే విద్యార్థి లక్నోలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కలిసేందుకు ఇన్నోవాలో గోమతినగర్‌ వెళ్లాడు. ఇంతలో దాదాపు పది మంది వ్యక్తులు అతడి కారును అటకాయించి.. కత్తితో దాడి చేశారు. ఛాతిలో కత్తి దింపి.. విచక్షణారహితంగా పొడిచారు. ఈ క్రమంలో కారు దిగిన ప్రశాంత్‌ అక్కడినుంచి స్నేహితుడి అపార్టుమెంటులోకి పరిగెత్తుకు వెళ్లాడు. 

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు అపార్టుమెంటుకు వెళ్లి పరిశీలించగా... ప్రశాంత్‌ రక్తపు మడుగులో కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ క్రమంలో అపార్టుమెంటు వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన ప్రశాంత్‌.. అక్కడ తన జూనియర్‌తో గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కారణంగానే అతడి హత్య జరిగినట్లు అనుమానిన్నామని తెలిపారు. ప్రశాంత్‌ స్నేహితులను విచారిస్తున్నామని.. త్వరలోనే కేసును ఛేదిస్తామని వెల్లడించారు. 

చదవండి: వీడియోతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement