బాయ్ఫ్రెండ్ను పిలిచి చంపించింది? | Girl Calls Boyfriend to Carter Road, Has Him Stabbed to Death | Sakshi
Sakshi News home page

బాయ్ఫ్రెండ్ను పిలిచి చంపించింది?

Published Wed, Sep 30 2015 8:11 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

బాయ్ఫ్రెండ్ను పిలిచి చంపించింది?

బాయ్ఫ్రెండ్ను పిలిచి చంపించింది?

ముంబై: ముంబైలో 21 ఏళ్ల యువతి పథకం ప్రకారం తన బాయ్ఫ్రెండ్ (22)ను పిలిచి చంపించినట్టు ఆరోపణలు వచ్చాయి. సోమవారం రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

నిందితురాలు తన బాయ్ఫ్రెండ్ రిజ్వాన్ ఖాన్కు ఫోన్ చేసి కార్టర్ రోడ్డుకు రావాల్సిందిగా కోరింది. ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలసి పబ్లో ఉన్నాడు. రిజ్వాన్ స్నేహితుడు సైఫ్ మీర్జా ఈ ఘటన గురించి వివరిస్తూ.. 'సోమవారం రాత్రి మేం పబ్లో ఉన్నాం. రాత్రి 11 గంటల ప్రాంతంలో రిజ్వాన్కు గర్ల్ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రిజ్వాన్, నేను కార్టర్ రోడ్డుకు వెళ్లాం. అక్కడ రిజ్వాన్ తన స్నేహితురాలిని కలిశాడు. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఇద్దరూ నా నుంచి దూరంగా వెళ్లిపోయారు. అక్కడ కొందరు వ్యక్తులు ఉన్నా నేను సందేహించలేదు. రిజ్వాన్ కనిపించకపోయే సరికి నేను పరిగెత్తివెళ్లి చూడగా రక్తంమడుగులో అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. రిజ్వాన్ ను కత్తితో పొడిచారు. అనుమానాస్పద వ్యక్తులు అక్కడి నుంచి బైకులపై వెళ్లిపోయారు. రిజ్వాన్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు' అని చెప్పాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిజ్వాన్ను చంపడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనుక రిజ్వాన్ స్నేహితురాలి పాత్ర ఉందని భావిస్తున్నామని, హత్యకు ఆమె కారణమని ఖర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement