Frog Marriage
-
కప్పలకు అంగరంగ వైభవంగా పెళ్లి.. ఎందుకో తెలుసా?
సాక్షి, జయపురం(భువనేశ్వర్): వర్షం కురవాలని కప్పకు పెళ్లి చేసిన అరుదైన సంఘటన నవరంగపూర్ జిల్లాలోని ఉమ్మర్కోట్ సమితి, కొరమరి గ్రామంలో ఆదివారం తారసపడింది. సాధారణంగా జరిగే వివాహం తరహాలోనే మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ కప్ప పెళ్లి అత్యంత వైభవంగా జరిపారు. కార్యక్రమం అనంతరం గ్రామస్తులంతా తమ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేపట్టి, ఆకట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ గ్రామ ఆదివాసీలంతా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతారు. అనాది కాలంగా ఏటా ఖరీఫ్ సీజన్లో ఇలా వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. ప్రధానంగా శ్రావణమాసంలో వరుణ దేవుడిని మెప్పించి, వర్షం పొందేందుకు ఇలా కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే మనుషుల పెళ్లిలో ఉండే తంతు అంతా ఈ కప్పల పెళ్లిలో కూడా కనిపిస్తుంటుంది. తొలుత తమ వ్యవసాయ దేవతలైన బీమ, బీమానిలకు నవదిన పూజలు చేస్తారు. ఆ తర్వాత పెళ్లికి కప్పల కోసం గాలిస్తారు. ఈ క్రమంలో రెండు, మగ మరో రెండు ఆడ కప్పలను మండపానికి తీసుకువచ్చి, పెద్దల సమక్షంలో సంప్రదాయ రీతిలో వాటికి పెళ్లి చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. ఈ సంప్రదాయం తరతరాల నుంచి కొనసాగుతూ వస్తోందని గ్రామస్తుడు రామనాథ్ పూజారి తెలిపారు. -
త్రిపురలో వర్షం కురవాలని కప్పల వివాహం
-
వర్షం కురవాలని పెళ్లి .. వైరల్ వీడియో..
దేశంలో కరోనా కల్లోలం వివాహలపై కూడా పెద్ద ప్రభావాన్నే చూపించింది. బంధువుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లిళ్లను కాస్త.. కొద్దిమంది సమక్షంలో ఏలాంటి సందడి లేకుండా జరుపుకుంటున్నారు. కాగా, త్రిపురలోని ఒక పట్టణంలో జరిగిన పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది మనుషుల పెళ్లి కాదండోయ్.. కప్పల పెళ్లి. వివరాలు.. త్రిపురలో వర్షం కురవాలని కప్పల వివాహం జరిపించారు. దీంట్లో ఇద్దరు మహిళలు వారి చేతుల్లో రెండు కప్పలను పట్టుకున్నారు. వాటికి సంప్రదాయ బట్టలను కూడా తొడిగారు. అంతటితో ఆగకుండా అందులో మగకప్పచేత... ఆడకప్పకు బొట్టు పెట్టించారు. అయితే.. దీంట్లో ఇద్దరు మహిళలు మాత్రం సామాజిక దూరాన్ని పాటించలేదు. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. కరోనాలోనూ ఆగని పెళ్లి.. కాస్త సోషల్ డిస్టెన్స్ పాటిస్తే బాగుండేది.. మీ వల్ల కప్పలకు కరోనా సోకే ప్రమాదం ఉంది.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, వర్షం సమృద్ధిగా కురవాలని వానాకాలం వచ్చేముందు చాలా చోట్ల కప్పల పెళ్లిలు జరిపిస్తారనే సంగతి తెలిసిందే. -
ప్రపంచంలోనే అరుదైన విడాకుల కేసు!
భోపాల్: సాధారణంగా మన దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవడం కోసం కప్పలకు వివాహం చేయడం చూస్తుంటాం. ఒక వేళ కుండపోత వర్షాలు కురుస్తుంటే.. వరదలతో బీభత్సం సృష్టిస్తుంటే అప్పుడేం చేయాలి. ఏం చేయాలో తెలియాలంటే భోపాల్ వెళ్లాలి. ప్రస్తుతం భారీ వర్షాలతో మధ్యప్రదేశ్ తడిసిముద్దవుతన్న సంగతి తెలిసిందే. అయితే వర్షాకాలం ప్రారంభంలో రాష్ట్రంలో పరిస్థితి ఇలా లేదు. ముఖ్యంగా రాజధాని భోపాల్లో తీవ్ర నీటి ఎద్దడి. తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. దాంతో భోపాల్ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో భోపాల్లో 48మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దాంతో డ్యామ్లన్నింటిని తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలను ఆపేందుకు ఓ వినూత్న ప్రయోగం చేశారు భోపాల్ ప్రజలు. గతంలో వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేస్తే.. నేడు వర్షాలు ఆగిపోవాలని ఆ కప్పల జంటకు విడాకులు ఇప్పించారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. కుండపోత వర్షాలను ఆపేందుకు ఇంద్రపూరి ప్రాంతానికి చెందిన శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు గతంలో తాము పెళ్లి చేసిన కప్పలను విడదీశారు. వేదమంత్రాల సాక్షిగా, వైభవంగా ఈ వేడుక నిర్వహించడం గమనార్హం. -
వానల కోసం కప్పల పెళ్లి
సాక్షి బెంగళూరు: జలక్షామం, వర్షాభావాన్ని నివారించేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడుపి కిదియూర్ హోటల్ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్ గుండా కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్ హోటల్ వద్దకు చేరుకుని, అనంతరం కప్పలకు వివాహం చేశారు. -
బెంగళూరులో కప్పల పెళ్లి
-
కప్పల పెళ్లికి రండి
సాక్షి బెంగళూరు: జలక్షామం, వర్షాభావాన్ని నివారిం చేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు పెళ్లిపత్రికలను ముద్రించి పంపిణీ చేశారు. ఉడుపి కిదియూర్ హోటల్ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్ గుండా కవి ముద్దణæ మార్గంలో ఉడుపి కిదియూర్ హోటల్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం కప్పలకు వివాహం చేస్తారు. -
వర్షాలు కురువాలని కప్పలకు పెళ్లి