దేశంలో కరోనా కల్లోలం వివాహలపై కూడా పెద్ద ప్రభావాన్నే చూపించింది. బంధువుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లిళ్లను కాస్త.. కొద్దిమంది సమక్షంలో ఏలాంటి సందడి లేకుండా జరుపుకుంటున్నారు. కాగా, త్రిపురలోని ఒక పట్టణంలో జరిగిన పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది మనుషుల పెళ్లి కాదండోయ్.. కప్పల పెళ్లి. వివరాలు.. త్రిపురలో వర్షం కురవాలని కప్పల వివాహం జరిపించారు. దీంట్లో ఇద్దరు మహిళలు వారి చేతుల్లో రెండు కప్పలను పట్టుకున్నారు. వాటికి సంప్రదాయ బట్టలను కూడా తొడిగారు. అంతటితో ఆగకుండా అందులో మగకప్పచేత... ఆడకప్పకు బొట్టు పెట్టించారు.
అయితే.. దీంట్లో ఇద్దరు మహిళలు మాత్రం సామాజిక దూరాన్ని పాటించలేదు. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. కరోనాలోనూ ఆగని పెళ్లి.. కాస్త సోషల్ డిస్టెన్స్ పాటిస్తే బాగుండేది.. మీ వల్ల కప్పలకు కరోనా సోకే ప్రమాదం ఉంది.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, వర్షం సమృద్ధిగా కురవాలని వానాకాలం వచ్చేముందు చాలా చోట్ల కప్పల పెళ్లిలు జరిపిస్తారనే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment