ఉడిపిలో స్వైన్ ఫ్లూతో ఏడుగురి మృతి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ ఏడాది 40 కేసులు నమోదు కాగా, వారిలో ఏడుగురు మరణించారు. ఈ విషయాన్ని ఉడిపి జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఒక్క ఉడిపి తాలూకాలోనే 22 కేసులు నమోదయ్యాయని, వారిలో నలుగురుమరణించారని జిల్లా వైద్య, కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ రామచంద్ర బైరి తెలిపారు. అలాగే కరకల లో మూడు కేసులు నమోదై ఒకరు మరణించారని, కుందాపూర్లో 15 కేసులు నమోదై ఇద్దరు మరణించారని చెప్పారు.
హెచ్1ఎన్1 వైరస్తో పోరాడేందుకు జిల్లాలో తగినన్ని మందులు ఉన్నాయని, అలాగే ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రులలో ఈ వైరస్ కనపడితే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా కోరామని అన్నారు. ఇప్పుడు వర్షాల కారణంగా మలేరియా కూడా ప్రబలుతోందని, అందువల్ల ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని డాక్టర్ రామచంద్ర బైరి కోరారు. ఆస్పత్రులలో వెంటిలేటర్లు, ఇతర సదుపాయాలు తగినన్ని ఉండేలా చూసుకోవాలన్నారు.