సాక్షి, బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి ఆరోగ్యం క్షీణిస్తోంది. మణిపాల్ కేఎంసీ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆదివారం ఆయనను మఠానికి తరలించనున్నారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని స్వామీజీ చెబుతుండేవారు. మరోవైపు స్వామీజీ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, హోమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం యొడియూరప్ప శనివారం హుటాహుటినా ఉడుపికి బయలుదేరారు. సాయంత్రం 5.30 గంటలకు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో స్వామిజీ ఆరోగ్యంపై చర్చించారు. సీఎం ఆదివారం శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకుని ఉడుపిలోనే ఉండనున్నారు.
మఠానికి తరలింపు
ఆదివారం పేజావర స్వామీజీని ఉడుపి మఠానికి తరలించినట్లు సీనియర్ స్వామిజీ విశ్వప్రసన్న తీర్థ తెలిపారు. స్వామీజీ కోసం మఠంలోనే ప్రత్యేకంగా వెంటిలేటర్లను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులెవ్వరూ మఠానికి వచ్చి ఇబ్బందులు పెట్టవద్దని, శీఘ్రంగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment