ఉడుపిలో విద్యార్థినులతో మాట్లాడుతున్న సీఎం
కర్ణాటక: ఉడుపి కాలేజీలో వీడియోల చిత్రీకరణపై పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేశారు, డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టారు, కేసును సిట్‌కి అప్పగించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మంగళవారం మంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర మహిళా కమిషన్ సభ్యులు వచ్చి కాలేజీలోని మరుగుదొడ్డిలో కెమెరా అమర్చలేదని చెప్పారన్నారు. హోమ్ మంత్రి ఈ కేసును పిల్లలాట అనడంపై స్పందిస్తూ, పిల్లలాట కాకపోతే కేసు నమోదు అయ్యేదన్నారు. కాలేజీ విద్యార్థులు తమాషా చేసి ఉండవచ్చని అని ఉండవచ్చని సీఎం అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువ మాట్లాడనన్నారు.
ఏడాదిన్నర కిందటే టీటీడీకి నెయ్యి బంద్
కాంగ్రెస్ సర్కారు విధానం వల్లే తిరుమలకు నందిని నెయ్యి సరఫరా స్తంభించిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ ట్వీట్ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ తిరుమలకు నందిని నెయ్యి నిలిచిపోయింది నిన్న మొన్న కాదు, గత ఒకటిన్నర సంవత్సరం క్రితమే బీజేపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా నిలిచిపోయింది, దీనికి కటీల్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తాము అడిగిన ధర ఇవ్వడానికి టీటీడీ వారు అంగీకరిస్తే నెయ్యి సరఫరా చేస్తామని తెలిపారు.
తీరప్రాంతంలో భూ పరిరక్షణ
ఉడుపి జిల్లా కాపు తాలూకా పడుబిద్రి వద్ద సముద్ర తీరాన్ని సీఎం పరిశీలించారు. తీరప్రాంతలో భూమి కోతకు గురి కాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలన్నారు. ఉడుపి జిల్లాలో అతివృష్టి వల్ల రూ.35 కోట్లు నష్టం జరిగిందని, సహాయక చర్యలకు నిధులు ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment