
స్టార్ హీరో ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి కర్ణాటక ఉడుపి వెళ్లిపోయాడు.

తన తల్లి శాలిని ఎప్పటినుంచి అనుకున్న కోరిక తీర్చేశాడు.

ఈ విషయమై ఇన్ స్టాలో క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టాడు.

తారక్ తల్లిది కర్ణాటకలోని కుందపుర ఊరు. గతంలో ఎన్టీఆర్ ఈ విషయం చెప్పాడు.

అయితే తన సొంతూరికి కొడుకుని తీసుకెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటోందట.

అది ఇన్నాళ్లకు కుదిరింది. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠం దర్శనం చేసుకున్నారు.

సెప్టెంబరు 2న తల్లి శాలిని పుట్టినరోజుకి నేనిచ్చే ఉత్తమ గిఫ్ట్ ఇదేనని తారక్ రాసుకొచ్చాడు.

దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్‌కి తల్లి, భార్య పిల్లలతో కలిసి వెళ్లిన ఈ ట్రిప్ చాలా స్పెషలే.

ఇందులోనే ఎన్టీఆర్ కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కాంతార' రిషభ్ శెట్టి ఉన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
