
టాలీవుడ్ నటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. డ్రగ్స్ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె శుక్రవారం నాడు స్వామివారిని దర్శించుకుంది.

అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చాక దర్శనం బాగా జరిగిందని పేర్కొంది.

ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ గురించి ప్రశ్నించగా అసలేం జరిగిందనేది మీకే తెలియాలి.. అనేక కథనాలు రాశారుగా అంటూ సెటైర్లు వేసింది.

ఇకపోతే హేమ కొత్త గెటప్‌లో కనిపించింది. మెడలో దేవుడి మాల ధరించింది. అలాగే చేతికి సైతం మాల ధరించడం విశేషం.




