న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన రిస్కులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయి నియంత్రణ ప్రమాణాలు అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ అభిప్రాయపడ్డారు. క్రిప్టోల ద్వారా అక్రమ మార్గంలో నిధుల మళ్లింపును అడ్డుకోవడంలో అమెరికా చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగిందని ఆమె చెప్పారు.
భారత్, అమెరికాలో వ్యాపార అవకాశాలపై ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, ఆర్థికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎలెన్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, సంక్షోభంలో చిక్కుకున్న క్రిప్టో ఎక్సే్చంజీ ఎఫ్‌టీఎక్స్ తాజాగా దివాలా తీసింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌టీఎక్స్‌తో పాటు దాని అనుబంధ హెడ్జ్ ఫండ్ అలమెడా రీసెర్చ్, డజన్ల కొద్దీ ఇతర సంస్థలు డెలావేర్ కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన ఎఫ్‌టీఎక్స్ .. నిధుల గోల్‌మాల్ సంక్షోభంతో కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment