janet yellen
-
G20 ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్
G20 గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్లో మూడవ జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం సోమవారం మొదలైంది. గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. VIDEO | "The state visit of PM Modi to the United States last month and his meeting with the US President have enhanced the strength and dynamism of the partnership (between India and US). The historic visit paved the way for new avenues of collaboration, propelling our… pic.twitter.com/YZLXBLdZrj — Press Trust of India (@PTI_News) July 17, 2023 ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి, 66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్‌ఎంసీబీజీ కాన్క్లేవ్ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
క్రిప్టోలపై అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన రిస్కులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయి నియంత్రణ ప్రమాణాలు అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ అభిప్రాయపడ్డారు. క్రిప్టోల ద్వారా అక్రమ మార్గంలో నిధుల మళ్లింపును అడ్డుకోవడంలో అమెరికా చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగిందని ఆమె చెప్పారు. భారత్, అమెరికాలో వ్యాపార అవకాశాలపై ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, ఆర్థికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎలెన్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, సంక్షోభంలో చిక్కుకున్న క్రిప్టో ఎక్సే్చంజీ ఎఫ్‌టీఎక్స్ తాజాగా దివాలా తీసింది. ఇందుకు సంబంధించి ఎఫ్టీఎక్స్తో పాటు దాని అనుబంధ హెడ్జ్ ఫండ్ అలమెడా రీసెర్చ్, డజన్ల కొద్దీ ఇతర సంస్థలు డెలావేర్ కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన ఎఫ్‌టీఎక్స్ .. నిధుల గోల్మాల్ సంక్షోభంతో కుప్పకూలింది. -
వృద్ధి, ద్రవ్యోల్బణం రానున్న బడ్జెట్ లక్ష్యాలపై నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే 2022-23 వార్షిక బడ్జెట్ (2023 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సమర్పించే అవకాశం) లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ మొదటిరోజు-మంగళవారం వాషింగ్టన్ డీసీలో బిజీబిజీగా గడిపారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్ యెల్లెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ, ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇందులో ఉన్నాయి. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌సహా పలువురు నిపుణుల అడిగిన ప్రశ్నలకు ఆమె సవివరంగా సమాధానాలు ఇచ్చా రు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు.. ► భారత్ ఎకానమీ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో అధిక ఇంధన ధరలు ఒకటి. ► మహమ్మారి సవాళ్ల నుంచి సమర్థవంతంగా బయటపడిన భారత్ అటు వృద్ధి-ఇటు ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా సమతౌల్యం చేయగలుగుతోంది. ఇది గమనించడం చాలా ముఖ్యం. ► భారత్ దేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థలు కూడా భారత్ ఎకానమీ బలహీనపడలేదన్న విషయాన్ని గుర్తిస్తున్నాయి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార రంగాలకు సంబంధించిన సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. వీటన్నింటినీ భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ► అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రజలకు చేరకుండా చూసుకుంటున్నాము. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్య ప్రజలపై పడ్డం లేదు. ► రూపాయిని తమ దేశాల్లో ఆమోదయోగ్యంగా మార్చేందుకు వివిధ దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. ► యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), బీహెచ్ఐఎం యాప్, ఎన్సీపీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అన్నీ ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యవస్థలతో కలిసి పటిష్టంగా పనిచేయడానికి తగిన ప్రయత్నం జరుగుతోంది. మన వ్యవస్థకు ఇంటర్–ఆపరేటబిలిటీ కూడా ఆ దేశాల్లోని భారతీయుల నైపుణ్యానికి బలాన్ని ఇస్తుంది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌తో ఆర్థికమంత్రి -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
పసిడి దూకుడుకు ‘యెలెన్’ కళ్లెం!
న్యూయార్క్/ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందని, రేట్ల పెంపు అనివార్యమని ఈ వారం మొదట్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ ఎలెన్ చేసిన ప్రకటనతో గడచిన వారంలో అంతర్జాతీయంగా పసిడి దూకుడుకు కళ్లెం పడింది. ఫిబ్రవరి 10తో ముగిసిన వారం స్థాయి ధర వద్దే ఫిబ్రవరి 17వ తేదీనా బంగారం ధర అంతర్జాతీయంగా నిలకడగా ఉంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,235 డాలర్ల వద్దే స్థిరంగా ఉంది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర భారీగా 45 డాలర్లు పెరగడం గమనార్హం. డాలర్ బలహీనతలు, గత వారం ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటన, అమెరికా ఆర్థిక అనిశ్చితి దీనికి దన్నుగా నిలిచాయి. మొత్తంమీద బంగారానికి 1,210 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి. అయితే మున్ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, డాలర్‌పై దాని ప్రభావం బంగారం కదలికలకు కారణమవుతుందన్నది నిపుణుల విశ్లేషణ. దేశీయంగా చూస్తే... ఇక దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా ధర పటిష్టంగా ఉండడం బంగారానికి కలిసి వచ్చింది. వారంలో ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.370 పెరిగి రూ.29,565కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత గలిగిన పసిడి విషయంలో ఈ ధర ఇంతే స్థాయిలో ఎగసి రూ.29,415కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.965 పెరిగి రూ.43,255కు ఎగసింది. -
28,068 దాటకపోతే, మరింత క్షీణత..
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల రోడ్‌మ్యాప్‌కు అవసరమైన ఆ దేశపు డేటా ప్రపంచ ఇన్వెస్టర్లను అయోమయానికి లోనుచేస్తున్న సమయంలోనే ఫెడ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ తాజాగా ఒక బాంబు పేల్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత తగ్గిపోతున్నద న్న ఆందోళన ఫెడ్ కమిటీ సభ్యుల్లో నెలకొన్నదని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సివుందంటూ గత శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఆర్థికాభివృద్ధి బావుందంటూ చెపుతూ వచ్చిన యెలెన్ హఠాత్తుగా చేసిన ఈ కామెంట్‌పై భిన్నమైన అంచనాలు తిరిగి మార్కెట్లో ఏర్పడ్డాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ కఠినవైఖరి వహించదన్న కారణంతో మార్కెట్లు పెరుగుతాయన్న అంచనాలు కొన్నయితే...అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందన్న సంకేతాలు అందుతున్నందున, మార్కెట్లు క్షీణిస్తాయన్న అంచనాలు మరోవైపు విశ్లేషకుల్లో ఏర్పడుతున్నాయి. ఇదిలా వుండగా...అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ సమీపిస్తున్నది. ఈ అంశాల నేపథ్యంలో రానున్న 3-4 వారాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... అక్టోబర్ 14తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్‌వారంలో 27,548 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 387 పాయింట్ల నష్టంతో 27,674 వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన 27,715 కీలకస్థాయికి దిగువన వరుసగా 2 రోజులపాటు సెన్సెక్స్ ముగిసిందున, ప్రస్తుత కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. వెనువెంటనే 28,043-28,068 పాయింట్ల శ్రేణిని (అక్టోబర్ 13నాటి గ్యాప్‌డౌన్ శ్రేణి) దాటకపోతే సెన్సెక్స్ మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ వారం మార్కెట్ పెరిగితే పైన ప్రస్తావించిన శ్రేణి వద్ద తొలి అవరోధం కలగవచ్చు. ఆపైన పటిష్టంగా ముగిస్తే క్రమేపీ 28,480 స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 27,550 సమీపంలో చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 27,350 వద్దకు పతనం కావొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే కొద్ది వారాల్లో 26,563 పాయింట్ల వరకూ (ఫిబ్రవరి కనిష్టస్థాయి 22,495 పాయింట్ల నుంచి సెప్టెంబర్ గరిష్టస్థాయి 29,077 వరకూ జరిగిన ర్యాలీకి 38.2% రిట్రేస్‌మెంట్ స్థాయి) పతనమయ్యే ప్రమాదం వుంటుంది. అవరోధ శ్రేణి 8,681-8,704 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,746 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 8,541 కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 115 పాయింట్ల నష్టంతో 8,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 8,681-8,704 శ్రేణి (అక్టోబర్ 13నాటి గ్యాప్) వద్ద గట్టి నిరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిపైన ముగిసే క్రమేపీ తిరిగి 8,810-8,820 (సెప్టెంబర్ 26నాటి గ్యాప్) కీలక అవరోధ శ్రేణిని చేరవచ్చు. రానున్న రోజుల్లో ఈ రెండో శ్రేణిని దాటితేనే నిఫ్టీ తిరిగి అప్ట్రెండ్లోకి అడుగుపెట్టే ఛాన్స్ వుంటుంది. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 8,540 పాయింట్ల సమీపంలో చిన్న మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును పరిరక్షించుకోగలిగితే పైన ప్రస్తావించిన తొలి అవరోధ శ్రేణి ని చేరే అవకాశాలుంటాయి. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 8,475 వ ద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,355 పాయింట్ల వరకూ క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ వారం మార్కెట్లో క్షీణత కొనసాగితే రానున్న వారాల్లో 8,150 వరకూ పతనమయ్యే అవకాశాలుంటాయి. -
రేట్ల పెంపునకు సిద్ధమే కానీ.. వేచిచూస్తాం
ఫెడ్ చైర్మన్ యెలెన్ న్యూయార్క్: ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు తగిన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ యెలెన్ పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్‌లో వెలువడనున్న ‘ఉపాధి’ గణాంకాల వరకూ వేచిచూస్తామని సూచించారు. ఫెడ్ వైస్ చైర్మన్ స్టాన్లీ ఫీచ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు 0.25-0.50 శాతం శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. టిటాన్ కౌంటీ జాక్సన్ హోల్ వ్యాలీలో జరిగిన ఒక సదస్సులో జానెట్ ప్రసంగిస్తూ.. ఫండ్ రేటు పెంపునకు తగిన పరిస్థితులు ఇటీవలి నెలల్లో ఏర్పడినట్లు తెలిపారు. అయితే సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్, నవంబర్లలో ఫెడ్ సమావేశాలు ఉన్నాయి. అయితే అమెరికా ఎన్నికలకు ముందు రేటు పెరగకపోవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు దశాబ్దకాలం తరువాత ఫెడ్ 2015 చివర్లో రేటును స్వల్పంగా పావుశాతం పెంచింది. -
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదు: యెలెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదని ఆ దేశ ఫెడరల్ బ్యాంక్ చీఫ్ జనెత్ యెలన్ పేర్కొన్నారు. అయితే త్వరలో పరిస్థితులు కుదుటపడతాయన్న విశ్వాసం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీకి (ఎఫ్ఓఎంసీ) ఉందని వివరించారు. సెనేట్ కమిటీ ముందు ఆమె దేశ ఆర్థిక పరిణామాలపై మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... మరికొంత కాలం ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) ఇదే ధోరణిలో కొనసాగే వీలుంది. అమెరికా పరపతి విధానం పరిస్థితులకు తగిన విధంగా స్పందించడానికి వీలుగా కొనసాగుతోంది. కొన్ని కీలక సమస్యలు చైనాకు పొంచి ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే (బ్రెగ్జిట్ )ఆ ప్రతికూల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ఉంటుంది. ఇక వేతన వృద్ధిలో ఇంకా మందగమనం ఉంది. మందగమనం తరువాత గృహ ఆదాయాలు ఇంకా తగిన స్థాయిలో పెరగలేదు. పారిశ్రామిక ఉత్పత్తిలో మందగమనం మరి కొంతకాలం కొనసాగే వీలుంది. -
అమెరికా చరిత్రలో తొలి మహిళా...జానెట్ యెలెన్
అమెరికా చరిత్రలో యూఎస్ ఫెడరల్ రిజర్వు సిస్టమ్ చైర్మన్ పదవి పగ్గాలను తొలిసారి ఓ మహిళ చేజిక్కించుకున్నారు. యూఎస్ ఫెడ్ చైర్ పర్సన్ గా జానెట్ యెల్లెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2013 లో అక్టోబర్ 9 తేదిన జానెట్ యెల్లెన్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫెడ్ వైస్ చైర్ పర్సన్ గా యెల్లెన్ సేవలందించారు. 2018 ఫిబ్రవరి 3 తేది వరకు ఫెడ్ చైర్ పర్సన్ గా యెల్లెన్ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఫెడ్ రిజర్వ్ చైర్మన్ గా బెన్ బెర్నెంకే వ్యవహరించిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు పెంచడానికి బాండ్ల కొనుగోళ్లలో కొత, వడ్డీ రేట్లలో తగ్గింపు అంశాలు యెల్లెన్ కు సవాల్ గా నిలువనున్నాయి. అమెరికా ఆర్ధిక మాంద్యంలో చిక్కుకున్న సమయంలో అనుసరించిన వడ్డీ రేట్ల పెంపు అనుభవం యెల్లెన్ కు కలిసివచ్చే అంశమని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఫెడ్ చైర్ ఉమన్‌గా యెలెన్
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త చైర్ ఉమన్‌గా 67 ఏళ్ల జానెట్ యెలెన్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. దీంతో 100 ఏళ్ల ఫెడరల్ రిజర్వ్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ఆ పదవిని అధిష్టిస్తున్నట్లయింది. తాజా పరిణామాలతో... ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ స్థానంలో తొలి చైర్‌ఉమన్‌గా యెలెన్ పదవిని చేపట్టనున్నారు. హాజరైన సెనేటర్లలో 56 మంది అనుకూలంగా, 26 మంది వ్యతిరేకంగా ఓటేయటంతో యెలెన్ నియామకం ఖరారైంది. ఈమె ప్రస్తుతం ఫెడ్‌కు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై వ్యాఖ్యానిస్తూ... ఉద్యోగ అవకాశాలకు ఊతమివ్వడం, అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాధించడానికి సమర్థమైన నాయకత్వం లభించినట్లయిందన్నారు. నాలుగేళ్ల పదవీకాలం గల ఫెడ్ చైర్మన్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన బెర్నాంకీ ఈ నెల 31న పదవీ విరమణ చేస్తారు.