అమెరికా చరిత్రలో తొలి మహిళా...జానెట్ యెలెన్
అమెరికా చరిత్రలో తొలి మహిళా...జానెట్ యెలెన్
Published Tue, Feb 4 2014 1:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
అమెరికా చరిత్రలో యూఎస్ ఫెడరల్ రిజర్వు సిస్టమ్ చైర్మన్ పదవి పగ్గాలను తొలిసారి ఓ మహిళ చేజిక్కించుకున్నారు. యూఎస్ ఫెడ్ చైర్ పర్సన్ గా జానెట్ యెల్లెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2013 లో అక్టోబర్ 9 తేదిన జానెట్ యెల్లెన్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫెడ్ వైస్ చైర్ పర్సన్ గా యెల్లెన్ సేవలందించారు.
2018 ఫిబ్రవరి 3 తేది వరకు ఫెడ్ చైర్ పర్సన్ గా యెల్లెన్ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఫెడ్ రిజర్వ్ చైర్మన్ గా బెన్ బెర్నెంకే వ్యవహరించిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు పెంచడానికి బాండ్ల కొనుగోళ్లలో కొత, వడ్డీ రేట్లలో తగ్గింపు అంశాలు యెల్లెన్ కు సవాల్ గా నిలువనున్నాయి.
అమెరికా ఆర్ధిక మాంద్యంలో చిక్కుకున్న సమయంలో అనుసరించిన వడ్డీ రేట్ల పెంపు అనుభవం యెల్లెన్ కు కలిసివచ్చే అంశమని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement