ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25 నేడే పార్లమెంట్ ముందుకు రానుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పిస్తున్నారు.
మోదీ ప్రభుత్వంలో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేశారు.
నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశంలోని వివిధ వర్గాలు అనేక ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో పన్ను ఉపశమనాలపై సామాన్యులు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు పన్ను తగ్గింపును ఆశిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకంతో బడ్జెట్ ఉండాలని నిపుణులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment