న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగియనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
సమావేశాలు ప్రారంభమయ్యే తొలిరోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.ఈ ప్రసంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తారు.
ఈ ఏడాది పార్లమెంట్ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ టర్ములో చివరగా జరగబోయే ఈ బడ్జెట్ సమావేశాలు రాజకీయ ప్రాధాన్యాన్ని ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీచదవండి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త చట్టంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment