న్యూఢిల్లీ: అనధికారిక రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉన్న రిస్కులను గుర్తించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) 28వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు.
స్థూల ఆర్థిక స్థిరత్వం, సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్ సన్నద్ధత, నియంత్రణ సంస్థల మధ్య సమస్యాత్మక అంశాలు మొదలైన వాటి గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేలా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని ఎఫ్‌ఎస్‌డీసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్, ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేవాశీష్ పాండా, ఆర్థిక సాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment