సాక్షి,ఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలలో తెలంగాణకు కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరామని రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం(జూన్22) జీఎస్టీ కౌన్సిల్ భేటీ ముగిసిన తర్వాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి.
సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి చేయాలి. సెస్, సర్ ఛార్జ్ పన్నులు పది శాతం మించకుండా చేయాలి. రాష్ట్రాల నికర రుణపరిమితి సీలింగ్ ముందుగానే చెపితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకుంటాం.
జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గత ఏడాది తెలంగాణకు 1.4 శాతమే నిధులు వచ్చాయి. ఉపాధి హామీ నిధులు ఆస్తుల సృష్టి పనులకి వినియోగించేలా అనుమతులు ఇవ్వాలి’అని కోరినట్లు భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment