Sports Budget 2023: Nirmala Sitharaman allocates Rs 3,397 crore - Sakshi
Sakshi News home page

Sports Budget 2023-24: క్రీడారంగాన్ని కరుణించిన నిర్మలమ్మ.. గతేడాదితో పోలిస్తే పెరిగిన స్పోర్ట్స్‌ బడ్జెట్‌

Published Wed, Feb 1 2023 5:28 PM | Last Updated on Wed, Feb 1 2023 5:52 PM

Rs 3397 32 Cr Allocated To Sports In Union Budget 2023 2024 - Sakshi

Union Budget: 2023-2024 కేంద్ర బడ్జెట్‌లో క్రీడారంగానికి పెద్దపీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1) లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడారంగానికి గతేడాదితో పోలిస్తే కేటాయింపులు ఓ మోస్తరుగా పెరిగాయి. 2022-23 బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ. 3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ. 3397 కోట్లకు (రూ. 334.72 కోట్ల పెరుగుదల) పెరిగింది.

గత ఐదేళ్ల కాలంలో కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా ఓ మోస్తరుగా నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌లో క్రీడా రం‍గానికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్‌ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గతేడాది మంజూరైన రూ. 3062 కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. తాజా బడ్జెట్‌లో నిర్మలమ్మ​ క్రీడలను కరుణించడంతో ఆ రికార్డు బద్ధలైంది. 

స్పోర్ట్స్‌ బడ్జెట్‌లో ఎవరికి ఎంత..? 

  • ఖేలో ఇండియా: రూ. 1045 కోట్లు 
  • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్): రూ. 785.52 కోట్లు
  • నేషనల్  స్పోర్ట్స్ ఫెడరేషన్: రూ. 325 కోట్లు
  • నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎన్‌ఎస్‌): రూ. 325 కోట్లు 
  • నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్: రూ. 15 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement