సైనిక పాలనకు వ్యతిరేకం: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సైనిక పాలనకు తాను వ్యతిరేకమని పాకిస్థాన్ తెహ్రరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సైనిక పాలన పరిష్కారం కాదని ఆయన అన్నారు. సైనిక పాలనకు ఇమ్రాన్ మొగ్గు చూపుతున్నారని వస్తున్న వార్తలను ఇమ్రాన్ ఖండించారు.
హింసాత్మక సంఘటల్ని తాము కోరుకోవడం లేదని ఇస్లామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజల ఆందోళనలు, నిరసనల్ని అడ్డుకోలేక విఫలమైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పాలన వైపుకు అడుగులేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ప్రజల హక్కులను సైనిక పాలన ద్వారా అణిచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.