యూటీగా హైదరాబాద్: పీటీఐ కథనం | Hyderabad as Union Territory - PTI | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 3 2013 8:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం కాంగ్రెస్ మరో ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అనంతరం హైదరాబాద్ ను చంఢీగడ్ తరహాలో ఉమ్మడి రాజధానిగా చేయాలని హైకమాండ్ పెద్దలు యోచిస్తున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. చంఢీగడ్ తరహాలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాష్ట్ర అంశంపై పీటీఐ ఓ కథనం ప్రచురించడంతో పార్టీ నేతలు మధ్య చర్చలు ఊపందుకున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement