మోదీ కృషి అద్భుతం: అమెరికా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో కృషిచేస్తున్నారని అయితే బ్యూరోక్రాట్ల తీరే సరిగా లేదని, వారి రెడ్‌టేపిజమే పెట్టుబడులు రావడానికి అవరోధంగా మారిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. భారత్‌లో ఒకవైపు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం, మరోవైపు రెడ్‌టేపిజం సమాంతరంగా నడుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక సహాయకుడు, జాతీయ భద్రతా మండలిలో దక్షిణాసియా వ్యవహారాల డెరైక్టర్ పీటర్ లెవోయ్ అన్నారు. కీలకాంశాల్లో గతంలో భారత్‌లో ఏ ప్రభుత్వం కూడా తీసుకోనంతగా ఇప్పుడు మోదీ సర్కారు సత్వర నిర్ణయాలు తీసుకుంటోందని పీటీఐకి తెలిపారు.