Indian Prime Minister Narendra Modi
-
ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు
అమరుల స్థూపాల సాక్షిగా వామపక్ష నేతల హెచ్చరిక యడ్లపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని పలువురు వామపక్ష నాయకులు హెచ్చరించారు. మండలంలోని తుమ్మలపాలెం వద్ద ఉన్న అమర్‌నగర్‌లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద బుధవారం సభ జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల సమాధులపై పూలు చల్లి, మృతవీరులకు నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది రావిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ధ్వజం ఎత్తారు. మరోమారు ఉద్యమబాట పట్టక తప్పదంటూ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘మేక్ ఇండియా’ ప్రకటనలకే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య విమర్శించారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానని, లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టిస్తానంటూ చెప్పిన మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పాలనను కొనసాగిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణకు సిద్ధం అవుతున్నాయన్నారు. దేశాన్ని అమ్మేస్తున్నారు! భారతదేశం ఒకప్పుడు తాకట్టులో ఉండేదని, ఇప్పుటి పాలకులు ఏకంగా అమ్మేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ అన్నారు. చంద్రబాబు దృష్టి బాకై ్సట్ ఖనిజాలున్న విశాఖపట్నం పైనే తప్ప ,దాని చుట్టూ ఉన్న అడవి బిడ్డలపై లేదన్నారు. 270 గిరిజన గ్రామాలు పొలవరంలో ముంపునకు గురైతే వారికి పునరావాసం కల్పించలేదన్నారు. కమ్యూనిస్టులందరూ ఒకే జెండా కిందకు రావాలని సీపీఐ చిలకలూరిపేట డివిజన్ ఏరియా కార్యదర్శి సీఆర్‌మోహన్ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజలకు కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు.ప్రస్తుత సమాజంలో దోపిడీ తీరు మారిందని, అందుకనుగుణంగా ఉద్యమాల తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు శివయ్య అన్నారు. -
కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు
రెండేళ్ల మోదీ పాలనపై అమెరికన్ నిపుణుల వ్యాఖ్య వాషింగ్టన్: కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు... వెరసి భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో మిశ్రమ ఫలితాలు సాధించారని అమెరికన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ రెసిడెంట్ ఫెలో, వాల్‌స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ అయిన సదానంద్ ధూమే అమెరికా చట్టసభ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ రెండేళ్ల పాలనపై వ్యాఖ్యానిస్తూ.. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించిందన్నారు. ప్రతిపక్షం అడ్డం కులు సృష్టించడం వల్లనో లేదా ధైర్యంగా నిర్ణయం తీసుకోలేక పోవడం వల్లనో సమూలంగా సంస్కరణలు చేయలేకపోయిందన్నారు. లోక్‌సభలో చాలినంత మెజారిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ చట్టాలను మార్చడానికి మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. అయితే మోదీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సడలించిందని.. రక్షణ, బీమా, ఆహార రంగాల్లో చాలా ప్రగతి సాధించిం దని అన్నారు. బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు అమెరికా ప్రోత్సాహం కొనసాగాలని ఆయన సూచించారు. అమెరికాకు కూడా భారత్ తో వ్యాపార సంబంధాలు అవసరమన్నారు. యూఎస్-భారత్ పాలసీ స్టడీస్ సెంటర్ ఫర్ స్ట్రేటజిక్, ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రతినిధి రిచర్డ్ ఎం రోసో, ఇతర వ్యాఖ్యాతలు మోదీ మరిన్ని సంస్కరణలు చేయాలని చెప్పారు. ఇంటర్నెట్ స్టార్‌గా ప్రధాని మోదీ న్యూయార్క్: ప్రధాన మంత్రి మోదీ వరుసగా రెండో ఏడాదీ ఇంటర్నెట్ లో అత్యంత ప్రభావవంత వ్యక్తుల్లో ఒకరిగా నిలి చారు. ఈ ఏడాది ఇంట ర్నెట్లో అత్యంత ప్రభావవంతమైన 30 మంది వ్యక్తుల్లో మోదీని ఒకరిగా ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్ చేర్చింది. దౌత్య సంబంధాలకు సామాజిక మాధ్యమ వెబ్సైట్లను తరచూ ఉపయోగించే మోదీని ఇంటర్నెట్ స్టార్‌గా ‘టైమ్’ అభివర్ణించింది. గతేడాది పాకిస్తాన్లో చేపట్టిన ఆకస్మిక పర్యటన గురించి మోదీ అనూహ్యంగా ట్విటర్ ద్వారా ప్రకటించడాన్ని ప్రస్తావించింది. సో షల్ మీడియాపై పోటీదారులు చూపిన ప్రపంచస్థాయి ప్రభా వం, వార్తలను మలచడంలో వారికి ఉన్న సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. జాబితాలో స్థానం సంపాదించిన వారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్, ‘హ్యారీపాటర్’ రచయిత్రి జేకే రౌలింగ్, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. మోదీకి 1.8 కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు. -
యే మేరా ఆసియన్..
-
ఐరాస సంస్కరణలపై ఐక్య గళం
ఉగ్రవాదం, వాతావరణ మార్పుపై కలసికట్టుగా పోరాటం * మనది వ్యూహాత్మక ప్రయోజనాలకు మించిన బంధం * ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో మోదీ * ఆఫ్రికాకు రూ. 65.33 వేల కోట్ల రుణం; అభివృద్ధి ప్రాజెక్టుల్లో చేయూత న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో సంస్కరణల కోసం భారత్, ఆఫ్రికాలు ఐక్యంగా గళమెత్తాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మారనట్లయితే ఐరాస అసంబద్ధమైన సంస్థగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదంపైనా భారత్, ఆఫ్రికాలు కలసికట్టుగా పోరాడాలన్నారు. మూడో ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో గురువారం మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఐరాస సంస్కరణల విషయంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కూడా మోదీతో జత కలిశారు. భద్రతామండలిలో భారత్‌తో పాటు ఆఫ్రికాలోని రెండు దేశాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతామండలిలోని శాశ్వత దేశాలు ఆఫ్రికా దేశాలను చిన్నచూపు చూస్తున్నాయని, తమను మరుగుజ్జులుగా భావిస్తూ అవమానిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా భారత్ తరఫున ఆఫ్రికాకు రాను న్న ఐదేళ్లలో రూ. 65.33 వేల కోట్ల మేరకు రాయితీతో కూడిన రుణాన్ని మోదీ ప్రకటించారు. రూ. 3.9 వేల కోట్ల సహాయక నిధిని కూడా ప్రకటించారు. ఇవి భారత్ ఇప్పటికే అందిస్తున్న రుణ సదుపాయాలకు అదనమని పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికాలది వ్యూహాత్మక ప్రయోజనాలు, ఆర్థిక లబ్ధికి మించిన భాగస్వామ్య బంధమని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల స్వప్నాలు ఒక్కటిగా వ్యక్తమవుతున్నసందర్భం ఇదని వ్యాఖ్యానించారు. ‘125 కోట్లమంది భారతీయుల, 125 కోట్లమంది ఆఫ్రికన్ల హృదయ స్పందన ఒక్కటిగా వినిపిస్తోంద’ంటూ అభివర్ణించారు. ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, అభివృద్ధి సాధన కోసం భారత్, ఆఫ్రికాలు ఒక్కటిగా సాగుతాయని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ సదస్సు గత మూడు దశాబ్దాల్లో భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద కార్యక్రమం. ఇందులో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 41 ఆఫ్రికా దేశాల అధినేతలు ప్రతినిధులుగా హాజరయ్యారు. మోదీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు.. * ప్రపంచం గతమెన్నడూ చూడని వేగంతో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో అత్యంత విస్తృతంగా మార్పు చెందుతోంది. ఐరాస సహా అంతర్జాతీయ సంస్థలు మాత్రం గత శతాబ్ద పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్పులు చేసుకోలేకపోతే అవి అసంబద్ధ సంస్థలుగా మిగిలిపోతాయి. అందుకే ఆయా సంస్థల్లో సంస్కరణలను భారత్ కోరుకుంటోంది. * ఐరాసలోని మొత్తం దేశాల్లో పాతిక శాతం ఆఫ్రికా దేశాలే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఈ రెండింటి నుంచి సరైన ప్రాతినిధ్యం లేని అంతర్జాతీయ సంస్థలేవైనా.. మొత్తం ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు. * ఉగ్రవాదం, వాతావరణ మార్పు, ఐరాస సంస్కరణలు.. వీటి విషయంలో భారత్- ఆఫ్రికాలు సహకరించుకోవాలి. * ఆఫ్రికా దేశాల్లో శాంతి పరిరక్షణకు ఆఫ్రికా దళాలకు భారత్ తరఫున శిక్షణనిస్తాం. * గత పదేళ్లలో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం రెండింతలయింది. 34 ఆఫ్రికా దేశాలకు భారతీయ మార్కెట్లో పన్ను రహిత ప్రవేశం లభిస్తోంది. ఆఫ్రికా ఇంధనంతోనే భారత ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. * ఆఫ్రికాలో భారత్ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపడ్తోంది. ఆఫ్రికాలో డిజిటల్ విప్లవానికి భారత్ సహకరిస్తుంది. * భారత్, ఆఫ్రికాల్లో రెండొంతుల జనాభా యువతే. ఆ మానవవనరులను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ శతాబ్దం మనదే. * సౌరశక్తి సమృద్ధిగా లభించే దేశాలు కూట మిగా ఏర్పడి, స్వచ్ఛ విద్యుత్ కోసం కృషి చేయాలి. * మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కన్న పాన్ ఆఫ్రికా ఈ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తాం. * భవిష్యత్ ప్రగతికి కీలకమైన ‘నీలి ఆర్థిక వ్యవస్థ’ అభివృద్ధికి సహకరిస్తాం. * వచ్చే సంవత్సరం నైరోబీలో జరిగే డబ్ల్యూటీవో భేటీలో ఆహార భద్రత, వ్యవసాయ సబ్సీడీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒత్తిడి తేవాల్సి ఉంది. -
మోదీ కృషి అద్భుతం: అమెరికా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో కృషిచేస్తున్నారని అయితే బ్యూరోక్రాట్ల తీరే సరిగా లేదని, వారి రెడ్టేపిజమే పెట్టుబడులు రావడానికి అవరోధంగా మారిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. భారత్‌లో ఒకవైపు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం, మరోవైపు రెడ్టేపిజం సమాంతరంగా నడుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక సహాయకుడు, జాతీయ భద్రతా మండలిలో దక్షిణాసియా వ్యవహారాల డెరైక్టర్ పీటర్ లెవోయ్ అన్నారు. కీలకాంశాల్లో గతంలో భారత్‌లో ఏ ప్రభుత్వం కూడా తీసుకోనంతగా ఇప్పుడు మోదీ సర్కారు సత్వర నిర్ణయాలు తీసుకుంటోందని పీటీఐకి తెలిపారు. -
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
అబుదాబి: పశ్చిమాసియా దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలలో బయటి దేశాల ప్రమేయం వల్లనే అశాంతి పెరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశాలు కలసికట్టుగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం తేలికవుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చిన సందర్భంగా మోదీ, స్థానిక ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సమస్యలు ఆయా దేశాలు పూనుకుంటేనే పరిష్కారమవుతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. పశ్చిమాసియా దేశాలన్నింటితో భారత్‌కు సత్సంబంధాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అంతర్గత సమస్యల్లో జోక్యం చేసుకోకూడదన్న మౌలిక నియమాన్ని భారత్ పాటిస్తూ, వివిధ అంశాల్లో చర్చలకు మద్దతిస్తోందన్నారు. ఈ ప్రాంత దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా శాంతి స్థాపనకు కృషి చేయాలని, ఈ కృషి కేవలం ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో అగ్రదేశాల అణు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదం వంటి అతి తీవ్రమైన సమస్యలు ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని, శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు అణు ఒప్పందం అనేది ఈ ప్రాంతంలో అస్థిరత్వానికి కారణం కానే కాకూడదు’ అని అన్నారు. పరస్పర విశ్వాసంతో ఈ ప్రాంతంలో చర్చలు, సహకారం మొదలవాలని అన్నారు. 34 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి వెళ్లిన మోదీ సాయంత్రం అబుదాబి చేరుకున్నారు. విమానాశ్రయంలో యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మోదీకి సంప్రదాయక స్వాగతం పలికారు. యువరాజుతో పాటు ఆయన ఐదుగురు సోదరులూ మోదీ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ సైనిక దళాల వందనాన్ని మోదీ స్వీకరించారు. ప్యాలెస్‌లో తనకు ఏర్పాటు చేసిన బసకు మోదీ చేరుకున్నారు. అక్కడ యువరాజుతో కాసేపు చర్చలు జరిపారు. శాంతికి ప్రతీక ఈ మసీదు.. అక్కడి నుంచి ముందుగా అరబ్‌లకు అత్యంత పవిత్రమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. 82 గుమ్మటాలతో అద్భుతమైన ఇస్లామిక్ నిర్మాణ కౌశల్యానికి ప్రసిద్ధి చెందిన ఈ మసీదు.. మక్కా, మదీనా మసీదుల తర్వాత మూడో అతిపెద్దది. లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,500 కోట్లతో నిర్మించిన ఈ మసీదుకు యూఏఈ తొలి అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అన్ నహ్యా పేరును పెట్టారు. ‘ఈ అపూర్వమైన పవిత్ర మసీదును సందర్శించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన నైపుణ్యానికి, సృజనాత్మకతకు గొప్ప ఉదాహరణ. శాంతికి, కరుణకు, సౌభ్రాతృత్వానికి, ఇస్లాంపై అచంచలమైన విశ్వాసానికి ఇది ప్రతీక’ అని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు. కీలక భాగస్వామిగా యూఏఈ యూఏఈతో తన చర్చల ఎజెండాను ఖలీజ్టైమ్స్కు ఇంటర్వ్యూలోనే మోదీ స్పష్టంగా సూచించారు. వాణిజ్యం, ఉగ్రవాద నిరోధం వంటి అంశాలలో యూఏఈతో కీలక భాగస్వామ్యం నెరపడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. రెండు దేశాలు ఉగ్రవాదం, తీవ్రవాదంతో సహా కొన్ని అంశాలలో ఒకే విధమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ అంశాలు రెండు దేశాలకు అత్యధిక ప్రాధాన్యాంశాలన్నారు. భద్రత విషయంలో యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇంధనం, పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని ఆశిస్తున్నామన్నారు. వ్యాపారానికి భారత్ ఆకర్షణీయ గమ్యంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించటం తన లక్ష్యమన్నారు. 1970లలో 180 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న యూఏఈ-భారత్ వ్యాపార బంధం ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లతో భారత్ మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని.. ఇది మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. భారతీయ కార్మికులతో భేటీ ఆ తర్వాత భారత్ నుంచి వలస వచ్చిన కార్మికులను ఐ-కాడ్ కార్మికుల రెసిడెన్షియల్ క్యాంప్ హౌస్‌లో కలిసి వారి సమస్యలపై చర్చించారు. క్రీడా హాల్లో వారితో ఫొటోలు దిగారు. ఈ దేశ అభివృద్ధిలో 26 లక్షల మంది భారతీయులు భాగస్వామ్యం వహించటం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం యువరాజుతో చర్చలు జరిపిన అనంతరం మోదీ దుబాయ్‌కి వెళ్తారు. అక్కడ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచంలో అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫాను సందర్శిస్తారు. అనంతరం దుబాయ్ క్రికెట్ మైదానంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని యూఏఈలో ఒక దేవాలయం నిర్మించుకోవటానికి స్థలం కేటాయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ సెల్ఫీ దౌత్యం అరబ్ దేశంలో కూడా కొనసాగింది. ప్రఖ్యాత షేక్ జాయేద్ మసీదును సందర్శించిన సందర్భంగా మోదీ అరబ్ రాజకుటుంబీకులు, షేక్‌లతో సెల్ఫీ దౌత్యం నెరిపారు. మీగడ రంగు కుర్తా, కాషాయం తెలుపు లాల్చీ ధరించిన మోదీ మసీదుకు వచ్చిన షేక్‌లతో తన మొబైల్‌తో సెల్ఫీకి పోజ్లిచ్చారు. -
ఉగ్రవాదంపై నిష్పాక్షిక పోరు
బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు * అంతర్జాతీయ నిబంధనలను కచ్చితంగా పాటించాలి * ఐరాస భద్రతమండలిలో సంస్కరణలు ఆవశ్యకం ఉఫా(రష్యా): స్వ, పర భేదం లేకుండా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని బ్రిక్స్ దేశాలకు భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాద గ్రూపులు, వాటికి సాయమందిస్తున్న దేశాలు, ఉగ్రవాదం లక్ష్యంగా చేసుకున్న దేశాలపై ఎలాంటి భేదభావం చూపకూడదని హితవు చెప్పారు. బ్రిక్స్, ఐరాస భద్రతామండలితో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా ఇదే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అంతర్జాతీయ నియమ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాలన్నారు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి శాంతి, సుస్థిరతలు మూల స్తంభాలని పేర్కొన్నారు. రష్యాలోని ఉఫాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో గురువారం మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు పింగ్, బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమాల సమక్షంలో ఉగ్రవాదంపై భారత వైఖరిని, ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన విధానాల్ని మోదీ వివరించారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌పై చర్యకు అవసరమైన సమాచారం భారత్ ఇవ్వలేదంటూ ఐరాసలో భారత ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ‘ఐరాస ఎలాంటి సామాజిక, ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనే స్థాయికి రావాలంటే ముందుగా, అతిత్వరగా భద్రతమండలిలో సంస్కరణలు రావాలి’ అన్నారు. అంతర్జాతీయంగా కీలక ఆర్థిక వ్యవస్థలైన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు.. ఏకాభిప్రాయం, సహకారంతో సవాళ్లు ఎదుర్కోవాలన్నారు. బ్రిక్స్ బ్యాంక్ వచ్చే సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని పుతిన్ తెలిపారు. బ్రిక్స్ డిక్లరేషన్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ వ్యూహాలు, పక్షపాత ధోరణి ఉండకూడదని బ్రిక్స్ డిక్లరేషన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉగ్రవాదంపై పోరులో పక్షపాత వైఖరి అవలంబిస్తున్న పాక్‌ను ఉద్దేశించే ఈ ప్రకటన అని, ఇది భారత్ సాధించిన విజయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సమన్వయం చేయాలని ఆ డిక్లరేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ స్టేట్ దురాగతాలను కూడా అందులో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై బ్రిక్స్ సదస్సు చర్చించింది. నేడు మోదీ, షరీఫ్‌ల భేటీ.. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సుల నేపథ్యంలో.. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు నేడు(శుక్రవారం) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కశ్మీర్‌పై పాక్ వ్యాఖ్యలు, బంగ్లాదేశ్‌లో మోదీ పాక్ వ్యతిరేక కామెంట్లతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే చర్యలపై మోదీ, షరీఫ్‌లు చర్చించనున్నారు. అలాగే, ఉగ్రవాదం, ఇతర సీమాంతర కార్యక్రమాలపై షరీఫ్‌కు మోదీ తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. బ్రిక్స్, ఎస్సీఓ సభ్య దేశాధినేతలకు గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన విందులో మోదీ, షరీఫ్‌లు ఎదురుపడ్డారు. నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న దాయాది దేశాల ప్రధానులు కాసేపు ముచ్చటించుకున్నారు. రష్యాలో ఇరాన్ అధ్యక్షుడు రౌహనీతో మోదీ భేటీ అయ్యారు. సహకారానికి పది సూత్రాలు బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం సమన్వయం పెంపొందాలని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో ‘దస్ కదమ్: భవిష్యత్తుకు పది అడగులు’ పేరుతో పది సూత్రాలను ప్రతిపాదించారు. వీటిలో వాణిజ్య ప్రదర్శన, రైల్వే పరిశోధన కేంద్రం, ప్రధాన ఆడిట్ సంస్థల మధ్య సహకారం, బ్రిక్స్ క్రీడా మండలి తదితరాలు ఉన్నాయి. కాగా, ఏకపక్ష ఆంక్షలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఉగ్రవాదంపై పాక్ న్యూసెన్స్
టైజానికి ఊతమిస్తూ భారత్‌కు సమస్యలు సృష్టిస్తోంది ♦ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ ♦ ఉగ్రవాదంపై కలసి పోరాడుదామని బంగ్లాదేశ్‌కు పిలుపు ♦ తీస్తా నదీ జాలల పంపిణీ సమస్యకు మానవీయ పరిష్కారం ఢాకా: బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ‘న్యూసెన్స్’ చేస్తోందని మండిపడ్డారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. భారత్, బంగ్లాదేశ్‌లు కలసికట్టుగా ఈ ప్రాంతంలోని ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో 90 వేల మంది పాకిస్తానీలు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మాది కూడా రాక్షస ప్రవృత్తే అయితే, వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకునేవారమో!’ అని అన్నారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు. గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్నవారు ఏం సాధించారు?ప్రపంచానికి ఏమిచ్చారు? ఉగ్రవాదానికి విలువలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. దాని లక్ష్యం ఒకటే. అదే మానవత్వంతో శత్రుత్వం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని లేశమాత్రం సహించబోమన్న బంగ్లా ప్రధాని హసీనా ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఢాకా వర్సిటీలోని బంగబంధు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో బంగ్లాదేశ్‌లోని ప్రవాస భారతీయులనుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించడంతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. బంగ్లాదేశ్‌కు మళ్లీ వస్తానంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు. ♦ నా పర్యటనకు ఈ రోజే ముగింపు. కానీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఆసియా దేశాలే కాదు ప్రపంచమంతా ఈ పర్యటనపై పోస్ట్‌మార్టం ప్రారంభిస్తుంది. ♦ భూ సరిహద్దు ఒప్పందం రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే అగ్రిమెంట్.. ♦ ప్రపంచంలోని ప్రతీ ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మొదటి ప్రపంచ యుద్ధంలో 75 వేలమందిని, రెండో ప్రపంచ యుద్ధంలో 90 వేల మందిని భారత్ కోల్పోయింది. ఏ దేశంపైనా ఆక్రమణకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో భారత్‌ది కీలక పాత్ర. అయినా.. భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ♦ బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం భారతీయుల గుండెల్ని ఉప్పొంగేలా చేస్తుంది. ♦ శిశు మరణాల నిరోధంలో భారత్ బంగ్లాదేశ్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ♦ మహిళా సాధికారత విషయంలో బంగ్లాదేశ్ స్ఫూర్తినిస్తుంది. ప్రధాని సహా ముఖ్య నేతలంతా మహిళలే. ♦ మానవీయ విలువల ఆధారంగానే తీస్తా నదీజలాల సమస్యను పరిష్కరిస్తాం. ♦ భారత్, బంగ్లాల అభివృద్ధికి సంబంధించి నాకు ఒకే రకమైన కలలున్నాయి. ♦ త్వరితగతిన ఎల్బీఏ అమలు: చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని (ఎల్బీఏ) క్షేత్ర స్థాయిలో అత్యంత శీఘ్రంగా అమలు చేయాలని భారత్, బంగ్లాలు నిర్ణయించాయి. పౌర అణు విద్యుత్తు, పెట్రోలియం, ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ‘నవతరం.. కొత్త దిశ’ పేరుతో ఒక ప్రకటనను మోదీ, హసీనా ఆదివారం సంయుక్తంగా విడుదల చేశారు. అందులో అంశాలు.. ♦ సరిహద్దు ఒప్పందం ఫలితంగా దేశాలు మారిన ప్రజలకు పూర్తి సహకారం ♦ అణు విద్యుత్‌లో సాంకేతిక సహకారం. ఇంధన రంగంలో సహకారంపై కార్యదర్శుల స్థాయి చర్చలు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య మరో మైత్రి ఎక్స్‌ప్రెస్ ♦ ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరులో పరస్పర సహకారం. మరో దేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు, ఉగ్రవాద శక్తులకు తమ దేశాల్లో తావు లేదని స్పష్టీకరణ ♦ అసాంఘిక శక్తులు సరిహద్దులు దాటకుండా ‘సరిహద్దు సమన్వయ నిర్వహణ ప్రణాళిక’ను అమలు చేయడం.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో జోక్యం! బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ దేశ విపక్ష నేత ఖలీదా జియా మోదీని కోరారు. ఆయనతో అరగంట భేటీ అయిన ఆమె బంగ్లాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. బంగ్లా అధ్యక్షుడు హమీద్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. కాగా, మోదీ బంగ్లా పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. వాజ్‌పేయి తరఫున అవార్డ్ స్వీకరణ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారా’న్ని వాజ్‌పేయి తరఫున భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మోదీకి అందించారు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం బంగ్లాభవన్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సహచరులు, పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. ఢాకేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు భారత ప్రధాని నరేంద్రమోదీ ఢాకాలో ఆదివారం ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయాన్ని, రామకృష్ట మఠాన్ని సందర్శించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులకు పవిత్రమైన దేవాలయాల్లో క్రీ.శ. 12వ శతాబ్దంలో బల్లాల సేనుడు నిర్మించిన ఢాకేశ్వరి ఆలయం ఒకటి. ఈ ప్రాంత ప్రధాన శక్తిపీఠాల్లో ఈ ఆలయాన్ని ఒకటిగా భావిస్తారు. ఈ దేవత పేరుమీదుగానే ఈ నగరానికి ఢాకా అని పేరు వచ్చిందని ప్రతీతి. ఆలయంలో దాదాపు పావుగంట పాటు గడిపిన మోదీ.. ఢాకేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు జరిపారు. రామకృష్ణ మఠ్‌లో అక్కడి స్వాములతో కలిసి మోదీ ప్రార్ధనలు చేశారు. రామకృష్ణ మిషన్‌తో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. -
సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ
మోదీ బంగ్లా పర్యటనలో ఎల్బీఏ అమలు ఖరారు ♦ భారత ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బంగ్లా ప్రధాని ♦ మోదీ, హసీనా, బెంగాల్ సీఎం మమతల సమక్షంలో ఒప్పందం ♦ భారత్‌కు 500 ఎకరాలు, బంగ్లాకు 10,000 ఎకరాల భూమి బదిలీ ♦ బంగ్లాదేశ్‌కు తాజాగా 200 కోట్ల డాలర్ల రుణం ప్రకటించిన మోదీ ♦ తొలి రోజు పర్యటనలో బంగ్లాతో భారత్ 22 ఒప్పందాలు ఖరారు ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య 41 ఏళ్ల సుదీర్ఘ సరిహద్దు వివాదానికి తెరపడింది. భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లా పర్యటన సందర్భంగా.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల సమక్షంలో రెండు దేశాలూ శనివారం చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని(ఎల్బీఏ) ఖరారు చేసుకున్నాయి. బంగ్లాలో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.. ఆ దేశానికి తాజా 200 కోట్ల డాలర్ల రుణసాయం ప్రకటించారు. అలాగా.. తీస్తా, ఫేని నదీ జలాల పంపిణీ సమస్యలకూ న్యాయబద్ధ పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సముద్ర ప్రాంత భద్రతలో సహకారం, మానవ అక్రమ రవాణా, నకిలీ భారత కరెన్సీ నిర్మూలన తదిరాలపై 22 ఒప్పందాలు కదుర్చుకున్నాయి. ఢాకాలో మోదీకి హసీనా స్వాగతం... మోదీ తొలిసారిగా రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన నిమిత్తం శనివారం ఢాకా చేరుకున్నారు. హసీనా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మోదీకి స్వాగతం పలికారు. ఆమె మంత్రివర్గ సహచరులూ హాజరయ్యారు. విమానాశ్రయంలోనే ఆయనకు సైనిక వందనం సమర్పించారు. ఢాకా మోదీ, హసీనా, మమతల ఫొటోలు, కటౌట్లతో తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీని బలంగా వ్యతిరేకించే మమత బంగ్లా పర్యటనలో ఆయనతో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించటం విశేషం. అంతకుముందు.. సోనార్ గావ్ హోటల్లో మమతతో మోదీ 20 నిమిషాలు సమావేశమై చర్చించారు. అనంతరం ఒకే వాహనంలో బంగ్లా ప్రధాని హసీనా కార్యాలయానికి చేరుకున్నారు. ఎల్బీఏ అమలు.. 200 కోట్ల డాలర్ల రుణం... హసీనా, మోదీలు సుదీర్ఘంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ముగ్గురి సమక్షంలో ఎల్బీఏ అమలుకు సంబంధించిన పత్రాలను ఇరు దేశాలూ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇందులో భాగంగా.. సరిహద్దులో బంగ్లా నుంచి భారత్‌కు 51 ప్రాంతాలు, భారత్ నుంచి బంగ్లాకు 111 ప్రాంతాలు లభించనున్నాయి. మొత్తం మీద భారత్‌కు 500 ఎకరాలు, బంగ్లాకు 10,000 ఎకరాల భూమి దక్కనుంది. అలాగే.. 50,000 మంది ప్రజల పౌరసత్వానికి సంబంధించిన సమస్య కూడా ఈ ఒప్పందం ద్వారా పరిష్కారం కానుంది. అనంతరం మోదీ, హసీనాలు మీడియాతో మాట్లాడారు. భారత్ 200 కోట్ల డాలర్లను బంగ్లాకు రుణంగా అందిస్తుందని మోదీ ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించిన 80 కోట్ల డాలర్ల రుణాన్ని సత్వరం అమలు చేస్తామని, 20 కోట్ల డాలర్లను పూర్తిగా పంపిణీ చేస్తామన్నారు. ఈశాన్య భారతంలో ఉగ్రవాదులు తలదాచుకునే ప్రాంతంగా పరిగణించే బంగ్లాలో ఉగ్రవాదుల పట్ల ఉపేక్ష చూపబోమని హసీనా హామీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య లోటును పూరించటానికి రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగ్లా యుద్ధ అమరవీరులకు నివాళులు 1971 బంగ్లా స్వాతంత్య్ర యుద్ధం అమరవీరులకు నివాళులు అర్పించి మోదీ బంగ్లా పర్యటనను ప్రారంభించారు. ఢాకా చేరుకున్న వెంటనే ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా సావర్ వద్ద ఉన్న ‘జాతియో స్మృతి సౌధో’ వద్దకు వెళ్లి అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్ చేసిన ఆ యుద్ధంలో భారత్ కూడా బంగ్లాకు సాయపడ్డం తెలిసిందే. అక్కడ బంగబంధు మనుమడు షేక్ రెజ్వాన్ సిద్దిఖి మోదీకి స్వాగతం పలికారు. సామర్లకోట ప్రాజెక్టు పరికరాలతో ప్రాజెక్టు బంగ్లాదేశ్‌లో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో భారీ విద్యుత్ ప్లాంటు, ఎల్ఎన్జీ దిగుమతి టెర్మినల్లు నెలకొల్పేందుకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థ ఆ దేశంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటలో విద్యుత్ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన పరికరాలను బంగ్లాలో విద్యుత్ ప్రాజెక్టును వేగంగా నిర్మించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. హిందూ మైనారిటీల కోసం గళం విప్పాలి... కాగా, బంగ్లాదేశ్‌లోని తాము అనునిత్యం మత ఛాందసవాదుల నుంచి మత వివక్ష, దాడుల భయంతో జీవిస్తున్నామని.. దీనిపై మోదీ గుర్తించి, బంగ్లా నాయకత్వంతో చర్చించాలని అక్కడి హిందువులు కోరారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ చిట్టగాంగ్ వెటరినరీ-యానిమల్ సెన్సైస్ వర్సిటీలో పోస్టర్లు అతికించినందుకు గాను..ముగ్గురు ఇస్లాం అతివాదులను అరెస్ట్ చేశారు. భారత్ - బంగ్లా మధ్య రెండు బస్సు సర్వీసులు షురూ మోదీ తొలి బంగ్లాదేశ్ పర్యటనను పురస్కరించుకుని.. భారత్ - బంగ్లాల మధ్య రెండు బస్సు సర్వీసులను ప్రారంభించారు. కోల్‌కతా - ఢాకా - అగర్తల; ఢాకా - షిల్లాంగ్ - గువాహటిల మధ్య నడిచే ఈ బస్సు సర్వీసులను ఢాకాలో హసీనా, మమతాబెనర్జీలతో కలసి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హసీనాకు అగర్తలా - ఢాకా - కోల్‌కతా బస్సు టికెట్‌ను మోదీ ఇవ్వగా.. మోదీకి ఢాకా - షిల్లాంగ్ - గువాహటి బస్సు టికెట్‌ను హసీనా ఇచ్చారు. మమతాబెనర్జీ కూడా హసీనాకు కోల్‌కతా - ఢాకా - అగర్తలా బస్సు టికెట్‌ను ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా రెండు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేసే ఈ బస్సు సర్వీసులు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయని మోదీ పేర్కొన్నారు. కోల్‌కతా నుంచి ఢాకా మీదుగా అగర్తలా వెళ్లే బస్సు సర్వీసు వల్ల.. త్రిపురకు ప్రయాణించే దూరం 560 కిలోమీటర్లు తగ్గనుంది. హసీనాకు వెంకటగిరి పరదా బహూకరించిన మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరిలో ప్రత్యేకంగా చేతితో అల్లిన పరదాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు కానుకగా ఇచ్చారు. జామ్దానీ శైలిలో అల్లిన ఈ పరదాపై కల్పవృక్షం, కామధేనువుల చిత్రాల అల్లికలు ఉన్నాయి. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్లో వ్యాఖ్యల ద్వారా వివరించారు. -
నేటి నుంచి బంగ్లా పర్యటన
మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ఢాకా: తొలిసారి తమ దేశంలో పర్యటించున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఎర్ర తివాచీ పరిచేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. దేశ రాజధాని ఢాకాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఢాకాలో మోదీ నిలువెత్తు కటౌట్లు పెట్టారు. హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢాకా వరకు 14 కి.మీ పొడవున హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మోదీతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రె హ్మాన్ నిలువెత్తు చిత్ర పటాలను కూడా ఏర్పాటు చేశారు. శనివారం నుంచి రెండ్రోజులపాటు సాగనున్న మోదీ పర్యటనలో ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందులో సరిహద్దు ఒప్పందం అత్యంత ప్రధానమైంది. దీనిపై మోదీ, మమత సమక్షంలో రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని హసీనా, మోదీ చర్చిస్తారు. అనంతరం కోల్‌కతా-ఢాకా-అగర్తల, ఢాకా-షిల్లాంగ్-గువాహటి బస్సు సర్వీసులను వారిరువురు జెండా ఊపి ప్రారంభిస్తారు. -
చైనాలో నరేంద్రమోదీకి ఘనస్వాగతం
-
భారత్‌లో ఎయిర్‌బస్ ‘తయారీ’!
-
భారత్‌లో ఎయిర్‌బస్ ‘తయారీ’!
ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచుతామన్న ఫ్రాన్స్ కంపెనీ - విమాన కర్మాగారాన్ని సందర్శించిన మోదీకి ‘ఎయిర్‌బస్’ వెల్లడి - మొదటి ప్రపంచ యుద్ధం స్మారకాన్ని సందర్శించిన భారత ప్రధాని తౌలోస్ (ఫ్రాన్స్): భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మద్దతు తెలిపింది. భారత్‌లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్‌లోని ఎయిర్‌బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్‌బస్‌ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్‌లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్‌లో తయారు చేయటానికి మేం సిద్ధం’’ అని చెప్పారు. భారత్‌లో ఎయిర్‌బస్ గ్రూపు సంస్థలు ప్రస్తుతం.. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం (ఆర్ అండ్ టీ) కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్ ఎండర్స్ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఎయిర్‌బస్ సంస్థ భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను ప్రస్తుతమున్న 40 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు ప్రధాని మోదీతో చెప్పిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆ తర్వాత ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో భారత అమర జవాన్లకు మోదీ నివాళులు ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా లిల్లె నగరానికి వెళ్లి.. అక్కడి మొదటి ప్రపంచయుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1914-18 మధ్య కాలంలో ఫ్రాన్స్ సరసన జర్మనీతో పోరాడుతూ మరణించిన 10,000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పలువురు భారతీయులు సమావేశమై ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే కావటం విశేషం. అనంతరం ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ స్టడీస్ (సీఎన్ఈఎస్)ను కూడా మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తనచుట్టూ చేరిన యువ విద్యార్థులతో ఆయన ‘సెల్ఫీ’ ఫొటోలు దిగారు. -
పొరుగు దౌత్యం.. పొందు లాభం
హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేపట్టిన పర్యటన వ్యూహాత్మకంగా కీలకమైంది. ఈ సౌహార్థ్రయాత్ర ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత పెంచడంలో ఓ ముందడుగనే చెప్పాలి. భారత్‌కు ఇరుగు పొరుగు ప్రపంచంతో సంబంధాల్ని సుసంపన్నం చేసుకోవడానికి స్నేహహస్తం అందుకోవడానికి ప్రధాని పరితపిస్తున్న తీరు ప్రశంసనీయం. ఓవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో తిష్టవేసిన చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి దక్షిణాసియాలో భారత్‌కున్న ప్రాధాన్యాన్ని మరింత ఇనుమడింపజేయడంలో తనదైన దౌత్య పాటవాన్ని ప్రదర్శించడంలో ప్రధాని అనుసరిస్తున్న తీరు అమోఘం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలైన శ్రీలంక, సీషెల్స్, మారిషస్ పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంపై మారీటైమ్ పవర్ పునరుద్ధరణకే అని భావించొచ్చు. సీషెల్స్, మారిషస్ దేశాల్లో ఇందిరాగాంధీ అనంతరం పర్యటించిన ప్రధాని మోదీ మాత్రమే. 1987లో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీలంకలో పర్యటించగా, ఆ తర్వాత కాలంలో అక్కడ పర్యటించిన ప్రధాని కూడా మోదీయే.హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక కార్యకలాపాల విస్తరణతో పాటు ఆర్థిక సంబంధాల్ని మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలతో చైనా గ డచిన దశాబ్ద కాలంలో ఆర్థిక సంబంధాల్ని మెరుగుపరచుకొంది. 2013 లో శ్రీలంక, మారిషస్ దేశాలకు సంబంధించి భారత్ తర్వా త రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. దశాబ్దానికి ముందు శ్రీలంక వాణిజ్యంలో చైనా వాటా 3 శాతం కాగా ప్రస్తుతం అది 11 శాతానికి చేరింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు పెద్ద పొరుగు దేశం శ్రీలంక. గత పదేళ్ల కాలంలో మహీందా రాజపక్సే హయాంలో చైనా వైపే మొగ్గు చూపింది. ఇప్పుడు మైత్రిపాల సిరిసేన నాయకత్వంలో ఆ దేశం భారత్‌తో స్నేహహస్తాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. సముద్ర జలాల భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకారానికి ఉవ్విళ్లూరుతోంది. సీషెల్స్‌లో మోదీ పర్యటన ఆఫ్రికా ప్రాంతానికి చెందిన సీషెల్స్‌కు మెడగాస్కర్, మారిషస్, టాంజానియాలు సముద్ర ప్రాంత దేశాలు. ఈ దేశం యునెటైడ్ కింగ్డమ్ నుంచి 29 జూన్ 1976న స్వాతం త్య్రం పొంది సర్వసత్తాక రాజ్యంగా వెలిసింది. 150 దీవులు కలిగిన సీషెల్స్‌కు రాజధాని విక్టోరియా. 2012 అంచనాల ప్రకారం సీషెల్స్ జనాభా 92వేలు. 2014 అంచనాల ప్రకారం జీడీపీ 2.76 బిలియన్ డాలర్లు కాగా తలసరి ఆదాయం 30 వేల డాలర్లు. సీషెల్స్ అధికార భాషలు ఫ్రెంచ్, ఇంగ్లిష్, సీషెలియస్ క్రియోల్ (ఫ్రెంచ్ ఆధారితమైన ఈ భాషను క్రియోల్ లేదా సెసెల్వా అని కూడా అంటారు). ఈ దేశాన్ని అధిక మానవాభివృద్ధి రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా యూఎన్డీపీ పేర్కొంది. 2013లో యూఎన్డీపీ మానవాభివృద్ధి సూచీ విలువ 0.756. సీషెల్స్ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ పర్యాటక రంగమే. 15 శాతం శ్రామిక శక్తికి పర్యాటక రంగం ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. నిర్మాణ, బ్యాంకింగ్, రవాణా, ఇతర కార్యకలాపాల్లో ఉపాధి కూడా పర్యాటక రంగంతో ముడిపడి ఉంది. 491 కిలోమీటర్ల సముద్ర తీరం సీషెల్స్ సొంతం. ఉపాధి, స్థూల రాబడి పరంగా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పర్యాటకంతో పాటు మత్స్య గ్రహణం (ఫిషింగ్), కొబ్బరి, వెనీలా ప్రాసెసింగ్, పీచు పరిశ్రమ, పడవల నిర్మాణం, ముద్రణ (ప్రింటింగ్), ఫర్నీచర్ ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. స్వీట్ పొటాటో, అరటి, పౌల్ట్రీ ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. జీడీపీలో సేవారంగం వాటా 66.4 శాతం, పరిశ్రమల వాటా 30.4 శాతం, వ్యవసాయ రంగం వాటా 3.2 శాతం.2015 మార్చి 10,11 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్‌లో పర్యటించారు. సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షులు జేమ్స్ మైఖేల్ మోదీకి స్వాగతం పలికారు. భద్రతకు సంబంధించిన సహకారాన్ని పటిష్ట పరిచే చర్యలో భాగంగా ఇరుదేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అవి 1. కోపరేషన్ ఇన్ హైడ్రోగ్రఫీ, 2. కోపరేషన్ ఇన్ రెన్యువబుల్ ఎనర్జీ, 3. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి సంబంధించిన సహకారం, 4. కోపరేషన్ ఇన్ ఎలక్ట్రానిక్ నావిగేషనల్ చార్ట్స్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భద్రతతో పాటు ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తీర ప్రాంత నిఘా రాడార్ ప్రాజెక్ట్ (కోస్టల్ సర్వైవలెన్స్ రాడార్ ప్రాజెక్టు)ను ప్రారంభించారు. సముద్ర తీర రక్షణ సామర్థ్యాల్ని పెంచడానికి సీషెల్స్‌కు భారత్ డార్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ (ఈౌటజ్ఛీట ్చజీటఛిట్చజ్ట) ను బహుకరించింది. వాతావరణ మార్పులను చక్కదిద్దడంలో ఇరు దేశాలు సంయుక్తంగా ముందడుగు వేసేందుకు నిర్ణయించాయి. మారిషస్ పర్యటన మారిషస్ విస్తీర్ణం 2040 చదరపు కిలోమీటర్లు. పరిమాణం లో ప్రపంచంలో 180వ స్థానం. 1968 స్వాతంత్య్రానంత రం అల్పాదాయ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థగా మారిషస్ అవతరించింది. పర్యాటకం, వస్త్ర పరిశ్రమ(టెక్స్టైల్స్), పంచదార, ఆర్థిక సేవలు (ఫైనాన్షియల్ సర్వీసులు) ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనవి.ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న మారిషస్‌కు మెడగాస్కర్, మయోతీ, కామెరూస్, సీషెల్స్, మొజాంబిక్, మలావిలు ఇరుగు పొరుగు దేశాలు. 2015లో మారిషస్ ఎగుమతుల్లో యునెటైడ్ కింగ్డమ్ వాటా 40.08 శాతం. ఫ్రాన్స్ వాటా 16.40 శాతం, అమెరికా 7.66 శాతం కాగా భారత్ వాటా 0.48శాతం. మారిషస్ దిగుమతుల్లో మాత్రం 35.16 శాతం తో మనదే ప్రథమ స్థానం. 2014 అంచనాల ప్రకారం మారిషస్ జనాభా 1.261 మిలియన్లు. 2015 అంచనాల ప్రకారం జీడీపీ 23.322 బిలియన్ డాలర్లు. తలసరి ఆదాయం 17,716 డాలర్లు. ప్రధాని మోదీ మారిషస్ సందర్శనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. 1.ఓషన్ ఎకానమీ రంగంలో పరస్పర అవగాహన ఒప్పందం. 2.2015-18 మధ్య కాలంలో సాంస్కృతిక సహకారానికి (Cultural Co-operation)సంబంధించి ఒప్పందం. 3.మారిషస్‌కు చెందిన అగాలెగా ద్వీపం (Agalega Island) అభివృద్ధి ద్వారా అవస్థాపనా రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య సహకారం. 4.సంప్రదాయ వైద్య విధానం (Traditional System Of Mediఛిజ్ఛీ), హోమియోపతి విషయంలో సహకారం. 5.భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతికి భారత్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోపరేషన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మారిషస్ ఆగ్రో పరిశ్రమ, ఆహార భద్రత మంత్రిత్వ శాఖ మధ్య ప్రోటోకాల్ ఒప్పందం. శ్రీలంక పర్యటన వాయువ్య దిశలో భారత్, ఈశాన్యంలో మాల్దీవులతో శ్రీలంక తీర సరిహద్దు కలిగి ఉంది. ఈ దేశ వైశాల్యం 65,610 చదరపు కిలోమీటర్లు. పరిమాణంలో ప్రపంచ దేశాలలో 122వ స్థానం. 2014 అంచనాల ప్రకారం జీడీపీ 142.719 బిలియన్ డాలర్లు. తలసరి ఆదాయం 7046 డాలర్లు. 2013లో మానవాభివృద్ధి సూచీ విలువ 0.750. సిలోన్ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగం వాటా 85 శాతం. జీడీపీలో సేవారంగం వాటా 60 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28 శాతం. వ్యవసాయ రంగం వాటా 12 శాతం. 2013లో శ్రీలంక ఎగుమతుల్లో అమెరికా వాటా 27.10 శాతం, తర్వాత స్థానాల్లో యునెటైడ్ కింగ్డమ్, ఇటలీ,భారత్‌లు ఉన్నాయి. దిగుమతుల విషయంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మన దేశమే. 2013లో లంక మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా 23.89 శాతం. తర్వాత వరుసలో సింగపూర్, ఇరాన్, చైనాలు నిలిచాయి.మోదీ లంక పర్యటన నేపథ్యంలో ఇరు దేశాలు వీసా, కస్టమ్స్, యువత సంక్షేమం, రవీంద్రనాధ్ ఠాగూర్ మెమోరియల్ ఏర్పాటు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రాం తీయ ప్రాధాన్యత, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై మోదీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరిపారు. శ్రీలంక పునర్నిర్మాణానికి భారత్ చేయూత శ్రీలంక అంతర్యుద్ధం అనంతరం ఆ దేశ పునర్నిర్మాణంలో భాగంగా తమిళుల కోసం 50 వేల ఇళ్ల నిర్మాణాన్ని భారత్ చేపట్టింది. ఇందులో 27 వేల ఇళ్లను పూర్తి చేసింది.శ్రీలంకలో రైల్వే రంగ అభివృద్ధికి 318 మిలియన్ డాలర్ల రుణాన్ని మోదీ ప్రకటించారు. ప్రస్తుతమున్న రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, రోలింగ్ స్టాక్ సేకరణకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. మటారాలోని రుహానా యూనివర్సిటీ రవీంద్రనాద్ ఠాగూర్ ఆడిటోరియం నిర్మాణంతోపాటు -తలైమన్నార్ - మదావచ్చియాళ్ రైలు మార్గం నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని భారత్ అందిస్తోంది. ట్రింకోమలి పట్టణాన్ని పెట్రోలియం హబ్‌గా అభివృద్ధి చేయడానికి భారత్ సమ్మతించింది.ట్రింకోమలిలో 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంకల్పించింది. శ్రీలంక సైనికులకు శిక్షణ, పెట్టుబడుల విషయంలోనూ భారత్ నుంచి ఆశించిన సాయం ఆ దేశం పొందే వీలుంది.ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు నిర్ణయించడం ద్వారా శ్రీలంక విదేశీ వాణిజ్య వృద్ధిలో ప్రగతి కనిపించనుంది. అలాగే తమిళ టైగర్ల ఆందోళన కారణంగా నిలిచిపోయిన సముద్ర మార్గాల పునరుద్ధరణ ద్వారా శ్రీలంక లబ్ధిపొందగలదు. శ్రీలంక ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మోదీ ప్రసంగం సిలోన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. శ్రీలంకలో పెట్టుబడులకు భారత్‌ను సహజ వనరుగా అభివర్ణించారు. శాంతి, సముద్ర జలాల భద్రత నెలకొనడానికి శ్రీలంక నాయకత్వానికి భారత్ భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. హిందూ మహాసముద్రం 21వ శతాబ్దపు భవిష్యత్‌ను నిర్ణయించగలదని, మోదీ అభిలషించారు. శ్రీలంక పౌరులకు వీసా సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పెంపుతో తగిన చర్యలు చేపట్టవచ్చన్నారు. అభివృద్ధి భాగస్వామ్యాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయని ఆకాంక్షించారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలు రెండు దేశాల సరిహద్దుల మధ్య స్వేచ్ఛగా ప్రవహించాలన్నారు. భారత్ భవిష్యత్ పట్ల తాను ఎలాంటి కలలు గంటున్నానో పొరుగు దేశాల విషయంలోనూ అదే ధోరణితో ఉన్నానని భాష్యం పలికారు. పార్లమెంట్లో మోదీ ప్రసంగం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్ర జలాల భద్రతలో భారత్, శ్రీలంకల మధ్య సహకారం మరింత పెరగాలి. లంక అభివృద్ధికి తగిన చేయూతను భారత్ అందిస్తుంది. ఉభయ దేశాల భద్రతకు హిందూ మహాసముద్రం కీలకమని, కలిసికట్టుగా పనిచేయడం ద్వారా విశ్వాసపూరిత వాతావరణాన్ని ఏర్పరచవచ్చన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించి సున్నితంగా వ్యవహరిస్తే లక్ష్యాల్ని సాధించడంలో సఫలీకృతులమవుదామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఓడించి సంఘర్షణాత్మక వాతావరణానికి చరమగీతం పాడటంలో లంక విజయవంతమైందని మోదీ కొనియాడారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికలు మా ర్పు, ఐక్యత, సత్సంబంధాల పునరుద్ధరణను ప్రతిబింబించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఐక్యత, సమగ్రత, శాంతి-సామరస్యం అందరికీ అవకాశాలు, గౌరవంతో కూడిన జీవితం పొందే భవిష్యత్తును సాకారం చేసుకునే సామర్థ్యం శ్రీలంకకు ఉందని వ్యాఖ్యానించారు. భారత్ వాణిజ్య వాతావరణం అనుకూలంగా మారుతోందని, ఈ పోటీ ప్రపంచంలో శ్రీలంక ఇతరుల్ని ప్రాధేయపడే పరిస్థితి రాకూడదన్నారు. ఇందుకు ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దోహదపడుతుందని ఆకాంక్షించారు. సమగ్ర భద్రతే పక్కా భరోసా మన దేశానికి 7,500 కిలోమీటర్ల విశాల సముద్ర తీరం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాణిజ్యం హిందూ మహాసముద్ర ప్రాంతం ద్వారానే జరుగుతుంది. హిమాలయాల విషయంలో చైనా ప్రస్తుత ధోరణినే అవలంబించినట్లయితే గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ (ఎఠజ ౌజ ఏౌటఝఠ్డ), స్ట్రయిట్ ఆఫ్ మలక్కా మధ్య జరిగే చైనా చమురు రవాణా నివారించడానికి తగిన నావికా దళాన్ని భారత్ అభివృద్ధి పరచుకోవాలి. కొన్నేళ్ల కిందట 152 నేవీ షిప్లున్న భారత్‌లో ప్రస్తుతం ఆ సంఖ్య 142కు తగ్గింది. దేశంలోని నాలుగు రక్షణ నౌకా నిర్మాణ యార్డులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. నిర్దిష్ట ప్రణాళిక, యాజమాన్య నిర్వహణ సక్రమంగా లేదు. వాటిని మరింత మెరుగుపరిచేందుకు పక్కా చర్యలు అవసరం. వీటితో పాటు న్యూక్లియర్ శక్తి ఆధారిత జలాంతర్గాముల సంఖ్యను మరింత పెంచాలి. ఇలా సమగ్ర భద్రతకు పక్కా చర్యలు చేపట్టినప్పుడే ఇరుగు, పొరుగు దేశాల నడుమ మనకంటూ ఓ స్థానం ఉంటుంది. -
‘చలే సాథ్ సాథ్...’
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ చర్చలు, పలు ఒప్పందాలు, నిర్ణయాల అనంతరం.. అమెరికా, భారత ప్రభుత్వాలు ఇరు దేశాల సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తీసుకున్న నిర్ణయాలను పేర్కొంటూ ‘స్నేహ ప్రకటన’ పేరుతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘చలే సాత్ సాత్: మనం కలిసి ముందుకెళదాం...’ అనే శీర్షికతో విడుదల చేసిన ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలివీ... భారత్, అమెరికాలు మన రెండు గొప్ప ప్రజాస్వామ్యాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తూ.. తమ దీర్ఘ కాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక స్నేహ ప్రకటన ద్వారా ఉన్నతృస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు చేపట్టే వేసే ప్రతి అడుగూ.. అంతర్జాతీయ భద్రత, ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఆకృతినిచ్చే దిశగా వేసే అడుగు. ఈ స్నేహ ప్రకటన.. మరింత ఉత్తమమైన ప్రపంచం కోసం మన ప్రభుత్వాలను, ప్రజలను మరింత సన్నిహితం చేసే ఉన్నత స్థాయి విశ్వాసం ప్రకటిస్తోంది. ఇరు దేశాలూ తరచుగా ఎక్కువసార్లు శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాలని నిర్ణయించాయి. వ్యూహాత్మక చర్చలకు వ్యూహాత్మక, వాణిజ్య చర్చలుగా ఉన్నతి కల్పించాలని నిర్ణయించాయి. ఈ చర్చల్లోని వ్యూహాత్మక అంశాలకు భౠరత విదేశీ వ్యవహారాల మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రులు నేతృత్వం వహిస్తారు. చర్చల్లోని వాణిజ్య అంశాలకు భారత అమెరికా వాణిజ్య మంత్రులు సారథ్యం వహిస్తారు. వ్యూహాత్మక ప్రాధాన్యత గల ప్రాజెక్టులపై సంయుక్త సంస్థలను (జాయింట్ వెంచర్లు) అభివృద్ధి చేయటంలో సహకరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. అర్థవంతమైన భద్రత, సమర్థవంతమైన ఉగ్రవాద వ్యతిరేక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. బహుముఖ వేదికలపై తరచుగా సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాయి. -
స్వచ్ఛభారత్ అంబాసిడర్లు
నిజామాబాద్ కల్చరల్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యురాలు కవిత, ప్రముఖ సినీ నటుడు నితిన్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లోని 18 మందిని అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛభారత్ అంబాసిడర్ల జాబితాను ప్రకటించారు. అందులో కవిత, నితిన్‌లు కూడా ఉన్నారు.