
స్వచ్ఛభారత్ అంబాసిడర్లు
నిజామాబాద్ కల్చరల్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యురాలు కవిత, ప్రముఖ సినీ నటుడు నితిన్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లోని 18 మందిని అంబాసిడర్‌లుగా ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛభారత్ అంబాసిడర్‌ల జాబితాను ప్రకటించారు. అందులో కవిత, నితిన్‌లు కూడా ఉన్నారు.