జీ(వి)తమింతేనా..? | Swachh Dhooth in srikakulam | Sakshi
Sakshi News home page

జీ(వి)తమింతేనా..?

Published Mon, Apr 23 2018 6:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

 Swachh Dhooth in srikakulam - Sakshi

 స్వచ్ఛదూత్‌

రాజాం/రేగిడి : స్వచ్ఛదూత్‌.. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడానికి నియమితులైన దూతలు. పాఠశాలల్లో పరిశుభ్రత మాటెలా ఉన్నా వీరి బతుకులను మాత్రం బాగు చేసుకోలేకపోతున్నా రు. అరకొరగానే స్వచ్ఛదూత్‌లను నియమించిన సర్కా రు ఆ కొద్ది మందికి కూడా 11 నెలలుగా వేతనాలు ఇ వ్వక వెతలు పెడుతోంది. ఈ చిరు ఆదాయంపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకువచ్చే స్వచ్ఛదూత్‌లు ఏడాది కాలంగా జీతం ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు ఉన్నాయో లేవో కూడా వారికి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఆపత్కాలంలో తమను ఆదుకునే వారి కోసం వారునిరీక్షిస్తున్నారు.

11 నెలలుగా..2016లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం కోసం స్వచ్ఛ దూత్‌లను నియమించారు. రాజకీయ వివాదాల కారణంగా కొన్ని పాఠశాలల్లో వీరి నియామకం చేపట్ట లేదు. మరికొన్ని పాఠశాలల్లో ఇలా మరుగుదొడ్లు క్లీన్‌ చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 4 వేల మందికి పైగా స్వచ్ఛదూత్‌లు అవసరం ఉండగా 2944 మంది మాత్రమే నియమితులయ్యారు. వీరిలో ఉన్నత పాఠశాలల్లో 357 మంది, యూపీ పాఠశాలల్లో 341 మంది, ప్రాథమిక పాఠశాలలో 2251 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గత 11 నెలలుగా వీరికి రావాల్సిన వేతనాలు ఇవ్వడం లేదు.

రూ.7కోట్లకు పైగా బకాయిలు..
స్వచ్ఛ దూత్‌లకు సర్కారు 2017 ఏప్రిల్‌ నెల నుంచి చెల్లింపులు నిలుపుదల చేసింది. జి ల్లా రాజీవ్‌ విద్యామిషన్‌ అధికారులు వీటిని చెల్లించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 357 మంది ఉన్నత పాఠశాలల స్వచ్ఛదూత్‌లకు సంబంధించి రూ.1,57,08,000లు ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబం ధించి 341 మంది స్వచ్ఛదూత్‌లు విధులు నిర్వహిస్తుండగా వీరికి రూ. 93,77,500లు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2251 మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల స్వచ్ఛదూత్‌లు విధులు నిర్వహిస్తుండగా వీరికి రూ.4,95,22,000లు చెల్లించాలి. జిల్లావ్యాప్తంగా మొత్తం స్వచ్ఛదూత్‌లకు రూ.7,46,07,500లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంతవరకూ వీటి ఊసెత్తిన వారు కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసినా అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగాలపై కూడా అనుమానాలు అధికమవుతున్నాయి. 

ఎన్నో అవమానాలు పడుతూ..
అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వారి ఆరో గ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛదూత్‌లను నియమించింది. వీరు ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రపరచాల్సి ఉంది. వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ.60 శాతం నిధులు గౌరవ వేతనం చెల్లిం చేందుకు వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సైతం అలానే ఉంచేసి ఇంతవరకూ వీరికి చెల్లింపులు జరపలేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు క్లీన్‌ చేయడం అంటే పెద్ద అవమానకరంగా భావిస్తారు. అయినప్పటికీ వేతనాలకు ఆశపడి ఈ విధుల్లో చేరిన మహిళలకు చివరకు నిరాశే మిగిలింది. ఉన్న కూలి పనులు మా నుకుని ఇటు వైపు వచ్చిన వారికి కూలి లేక, వేతనాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

ఇబ్బందులు పడుతున్నాం 
గత 11 నెలలుగా నా గౌరవ వేతనం రాలేదు. నేను స్వచ్ఛదూత్‌గా చేరి రెండేళ్లు కావస్తుంది. ప్రారంభంలో నెలకు రూ. 2 వేలు అంటూ కొన్నాళ్లు ఇచ్చారు. ఇప్పుడు అవి ఇవ్వడం లేదు. మాకు ఆ డబ్బులు వస్తాయో రావో అని అనుమానంగా ఉంది. – కొండంగి పెంటమ్మ, స్వచ్ఛదూత్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వన్నలి, రేగిడి మండలం. 

సేవే మిగిలింది..
నేను మా పాఠశాలల్లో మరుగుదొడ్లు క్లీన్‌ చేయాలంటే ఎంతో కష్టపడాలి. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సెలవు సమయంలో కూడా శుభ్రంగా ఉంచాలి. ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు వస్తుంటారు. కాబట్టి రాత్రి సమయాల్లో మా కుటుంబ సభ్యులు మరుగుదొడ్లకు కాపలా కూడా కాస్తుంటారు. నాకు గత 11 నెలలుగా రావాల్సిన వేతనం అందించలేదు. ఈ సేవలు అరువు సేవలుగా కనిపిస్తున్నాయి. 
– బి.సూరీడమ్మ, స్వచ్ఛదూత్‌ జెడ్పీ హైస్కూల్, డోలపేట, రాజాం 

నిధులు విడుదలవుతాయి..
స్వచ్ఛదూత్‌ల గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదలవుతాయి. ఈ మేరకు పరిశీలిస్తున్నాం. ఇటీవల బడ్జెట్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. అన్ని పాఠశాలల్లో స్వచ్ఛదూత్‌లు మంచి సేవలు అందించారు. వారికి సకాలంలో గౌరవ వేతనాలు అందకపోవడం శోచనీయం.– ఆర్‌వీఆర్‌జే రాజు, ఎంఈఓ, రాజాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement