వారణాసి: యూపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు యోగి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇదే పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వారణాసి నియోజకవర్గంలోని ఖజురి గ్రామంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
తనపై ఉన్న వ్యతిరేకతతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ వంటి పథకాలను ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు కార్యక్రమాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లపాటు ఖాదీని రాజకీయ లాభానికి వాడుకున్న కాంగ్రెస్ పార్టీ...ఇప్పుడు ఆ పేరును కూడా తలుచుకోవడం లేదని చెప్పారు.
తమ ప్రభుత్వం ఖాదీ, యోగాకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజీని తెచ్చిందన్నారు. అనంతరం ప్రధాని వారణాసిలో మేథావులు, పలువురు ప్రముఖులతో ముఖాముఖి మాట్లాడారు. యూపీ అభివృద్ధి కొనసాగేందుకు బీజేపీకే మళ్లీ అవకాశమివ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment