న్యూఢిల్లీ: బీజేపీ, సమాజ్‌వాద్ పార్టీల మధ్య విమాన ప్రయాణం పై మాటల యుద్ధం జరిగింది. ఉత్తరప్రదశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత నెలలో మార్చి 11న లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కి విమానం టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో యోగి మార్చి 11 వెంటనే టికెట్ బుక్ చేసుకుని పారిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు పై బీజేపీ నాయకులు ఎంతలా భయపడుతున్నారో అర్థం అవుతుంది అంటూ విమర్శించారు.
బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలియదు మీరు భయపడి పారిపోయేవరకు అని బహ్రైచ్‌లో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గత నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధిఐపి సింగ్ యోగిని విమర్శిస్తూ..తాను మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో గోరఖ్‌పూర్‌కి బుక్ చేసినట్లు తెలిపిన విమాన టిక్కెట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు
దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల కోసం మార్చి 11న లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కి బయలుదేరుతంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లండన్‌కి ఎగరిపోతారంటూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. దీంతో అఖిలేశ్ యాదవ్ ఈ రోజు ర్యాలిలో ఆ మాటలకు కౌంటరిచ్చారు. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల ఓటింగ్‌లో నాలుగు రౌండ్లు జరగగా.. మార్చి 10న ఫలితాలు వెల్లడనున్న సంగతి తెలిసిందే.
अखिलेश यादव के लंदन के टिकट को लेकर सनसनी, 11 मार्च को लंदन जाने का है टिकट
— Arun Yadav (@beingarun28) February 21, 2022
क्या कोई सच्चाई बता सकता है❓
(చదవండి: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment