Uttar Pradesh Assembly Election 2022: గడిచిన దశాబ్దం కాలంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన ఓటు బలం అగ్రవర్ణాల్లోని వైశ్యులు, బాహ్మణులు, రాజ్‌పుత్‌లు. మొత్తం యూపీ జనాభాపరంగా చూస్తే వైశ్యులు తక్కువే అయినప్పటికీ 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజికవర్గంలో బీజేపీకి మద్దతు తగ్గింది. అలాగే బ్రాహ్మణులు మొత్తం యూపీ జనాభాలో గణనీయంగా 8 నుంచి 9 శాతం ఉంటారు. వీరిలోనూ బీజేపీకి పడే ఓట్లలో 6 శాతం తగ్గాయి. దానికి తోడు బీజేపీలో రాజ్‌పుత్‌లకు పెద్దపీట వేస్తున్నారని, బాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఏడాదికాలంగా ఆ సామాజికవర్గంలో బలమైన భావన ప్రబలుతోంది. నష్టనివారణకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది.
బ్రాహ్మణుల్లో ప్రముఖుడు, యువ నాయకుడు, రాహుల్ గాంధీ కోటరీ సభ్యుడైన జితిన్ ప్రసాదనలు లాగేసింది. అలాగే లఖీంపూరి హింసాకాండ ఘటనలో ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలి... అతను జైల్లో ఉన్నందువల్ల దీనికి అసలు కుట్రదారైన అతని తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు ఎంత గట్టిగా డిమాండ్ చేసినా... బ్రాహ్మణ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని, వారికి కోసం తెప్పించకూడదనే ఉద్దేశంతో కమలదళం అజయ్ మిశ్రాను కాచింది. ఇక కుర్మీల విషయానికి వస్తే అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్ (ఎస్) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలోకి మారారు. ఇలా ప్రధాన బలమైన సామాజిక వర్గాల లెక్కల్లో తేడా కొడుతుండటం బీజేపీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది.!
– నేషనల్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment