Breadcrumb
- HOME
ఉత్తర ప్రదేశ్‌లో ముగిసిన ఆరో దశ పోలింగ్
Published Thu, Mar 3 2022 7:03 AM | Last Updated on Thu, Mar 3 2022 6:46 PM
Live Updates
ఉత్తర ప్రదేశ్ ఆరో దశ పోలింగ్
ఉత్తర ప్రదేశ్‌లో ముగిసిన ఆరో విడత పోలింగ్
ఉత్తర్ ప్రదేశ్‌లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
యూపీ: సాయంత్రం 5 గంటల వరకు 53.31శాతం పోలింగ్ నమోదు
ఉత్తర ప్రదేశ్‌లో ఆరో విడత ఎన్నికల్లో సాయంత్రం అయిదు గంటల వరకు 53.31శాతం పోలింగ్ నమోదైంది. కాగా ప్రపంచంలో ఏ పార్టీ కూడా బీజేపీ చెప్పినన్నీ అబద్ధాలు చెప్పదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని, మరోవైపు బీజేపీ మాత్రం దేశంలో అన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూనే పోతుందని మండిపడ్డారు.
ఓటేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఆరో దశ ఎన్నికల సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని ఓ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
యూపీ: మధ్యాహ్నం 3 గంటల వరకు 46.70% పోలింగ్ నమోదు
ఉత్తర ప్రదేశ్‌లోని 10 జిల్లాల్లో జరుగుతున్న ఆరవ దశ పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.70% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#UttarPradeshElections | 46.70% voters turnout recorded till 3 pm during ongoing polling across 10 districts in the sixth phase. pic.twitter.com/Z56Umw26Yy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022
యూపీ: మధ్యాహ్నం 1 గంట వరకు 36.33% పోలిగ్ నమోదు
ఉత్తర ప్రదేశ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 36.33% ఓటింగ్ నమోదైంది.యూపీలో 10 జిల్లాల్లోని 57 స్థానాలకు ఆరో దశలో పోలింగ్ జరుగుతోంది.
#UttarPradeshElections | 36.33% voters turnout recorded till 1 pm during ongoing polling across 10 districts in the sixth phase pic.twitter.com/Q61Cmk3Oia
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022
యూపీ: ఉదయం 11 గంటల వరకు 21.79 శాతం పోలింగ్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 21.79 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
#UttarPradeshAssemblyElections | 21.79% voter turnout recorded till 11 am during ongoing polling across 10 districts in the sixth phase pic.twitter.com/qtI8yml7D1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022
యూపీ: ఉదయం 9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
8.69% voter turnout recorded till 9 am in the sixth phase of #UttarPradeshAssembly elections
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022
Voting is underway in 57 Assembly seats across 10 districts pic.twitter.com/HPAA2WUSB9
యూపీ: ఓటేసిన శుభావతి శుక్లా
యూపీ ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి శుభావతి శుక్లా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
యూపీ: కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలిసులు భద్రత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది.
యూపీ: ఫాజిల్‌నగర్ నుంచి స్వామిప్రసాద్ మౌర్య
ఇక ఎన్నికల వేళ బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామిప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. విపక్ష నేత, సమాజ్‌వాదీ నాయకుడు రామ్‌గోవింద్ చౌదరి బన్స్ది నుంచి బరిలో ఉన్నారు. తంకుహిరాజ్ నుంచి అజయ్‌కుమార్ బరిలో దిగారు.
గోరఖ్‌పూర్ స్థానంలో తొలిసారి యోగి
యూపీలో ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. గోరఖ్‌పూర్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ మాజీ నేత ఉపేంద్ర దత్ శుక్లా భార్యను యోగికి ప్రత్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టింది.
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
యూపీ ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయమే గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ కన్యా నగర్ క్షేత్రం ప్రాథమిక పాఠశాలలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
యూపీ: ఆరో దశ పొలింగ్ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్
యూపీలో ఆరోదశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ దశ పోలింగ్‌లో 676 మంది అభ్యర్థుల్లో పలువురు ప్రముఖులున్నారు. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నుంచి యూపీసీసీ చీఫ్ అజయ్‌కుమార్ లల్లు, సమాజ్‌వాదీ నుంచి స్వామి ప్రసాద్ మౌర్య తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
యూపీ: ఆరో దశ పోలింగ్ ప్రారంభం
ఉత్తర ప్రదేశ్‌లో గురువారం ఉదయం 7 గంటలకు ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. పూర్వాంచల్‌లో 10 జిల్లాల పరిధిలో 57 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ ప్రారంభమైంది. 2.14 కోట్ల మంది ఓట్లరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Related News By Category
Related News By Tags
-
యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరస్పరం నవ్వుకుంటూ పలకరించుకున్నారు. యూపీలో నూ...
-
ఎస్పీని బోల్తా కొట్టించిందీ.. కమలాన్ని వికసింపజేసిందీ ఆ 10 అంశాలే!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధ...
-
‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ ...
-
పెట్రోల్ ట్యాంక్‌లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది’
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో అన్ని దశల్లో పోలింగ్ ముగియనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కూడా యూపీ చివర విడుత పోలింగ్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్‌కు రెండు రోజు...
-
అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు.. బీజేపీకి బిగ్ షాక్
బలియా: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశలో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక...
Comments
Please login to add a commentAdd a comment