యూపీలో కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోరు నడుస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్, పలు చిన్న పార్టీలు ఎటూ రంగంలో ఉంటాయి. దాంతో చాలా సెగ్మెంట్లలో అతి తక్కువ మెజారిటీ నమోదవడం ఆనవాయితీగా వస్తోంది. 1985 నుంచి 2012 దాకా చూస్తే సగటున ఏకంగా 150 సీట్లలో 5 శాతం కంటే తక్కువ మెజారిటీ నమోదైంది.
2012లో ఈ సంఖ్య 170కి చేరింది. అలాంటిది, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఈ సంఖ్యను సగానికి, అంటే 80కి తగ్గించగలిగింది. మోదీ మ్యాజిక్, యోగి కరిష్మా కలిసొచ్చి అగ్రవర్ణాలతో పాటు ఓబీసీ ఓట్లనూ కొల్లగొట్టి ఏకంగా 40 శాతం ఓట్లు, రికార్డు స్థాయిలో 312 సీట్లు సాధించడమే ఇందుకు కారణం. 159 బీజేపీ అభ్యర్థుల మెజారిటీ 15 శాతం దాటింది. కేవలం 38 మంది మాత్రం గట్టి పోటీ ఎదుర్కొని 5 శాతం కంటే తక్కువ మెజారిటీతో బయటపడ్డారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment