
Everyone Wants PM Modi's Help: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుల్లియా ప్రచార ర్యాలీలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ హేమా మాలిని ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతి ఒక్కరూ మోదీ జీ మీరు జోక్యం చేసుకోండి అని కోరారు అని చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభ్యర్థించారంటేనే నిజంగా ప్రపంచం ఆయనకు ఎంతగా గౌరవం ఇస్తుందో తెలుస్తోందన్నారు.
పైగా ఇది మనకు చాలా గర్వకారణం అని ప్రశంసించారు. ఆయన తనకంటూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దేశాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. అంతేకాదు ఆ ప్రచారా ర్యాలీ మొత్తం డబుల్ ఇంజన్‌కి సర్కార్ నినాదం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నాయకత్వాన్ని సైతం ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా బీజేపీ చేసిన సోషల్ మీడియా ప్రచారాల్లో ప్రపంచ నాయకుడిగా పీఎం మోదీ ఔన్యత్యాన్ని గురించి చాటి చెప్పిందన్నారు.
ఈ మేరకు మోదీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి డయల్ చేసి, "తక్షణ హింసను నిలిపివేయాలని" విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి తమ పౌరులు సురక్షితంగా వచ్చేందుకే భారత్ అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుందని కూడా నొక్కి చెప్పారని అన్నారు. రష్యా, నాటో సమూహం మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయన్న తన దీర్ఘకాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని చెప్పారు.
(చదవండి: ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం)
Comments
Please login to add a commentAdd a comment